కంటిమి నేఁడీభాగ్యము కన్నులతుదల నేము
(॥పల్లవి॥)
కంటిమి నేఁడీభాగ్యము కన్నులతుదల నేము
నంటున సంతోషించుకొంటిమి వో విభుఁడ
(॥కంటి॥)
మొలకచన్నులమీఁద మోపి నీవు కొనగోరు
వలపు కలుపుదీసేవా ఆకెకు
కిలకిల నవ్వఁగానే గిలిగించే వప్పటిని
నలువంకఁ గూరిములు నాఁటు వేసేవా
(॥కంటి॥)
ఘనమైన పిరుఁదుపై కట్టేవు మొలనూళ్ళు
గలమెలు జవ్వనానకొనరించేవా
పెనఁగి సిగ్గువడఁగ బిగ్గెఁ గాఁగిలించేవు
వునికిగా రతిపంట లొడుపఁగఁ జూచేవా
(॥కంటి॥)
ముప్పిరిఁ దురుమునిండ ముడిచేవు పువ్వులు
తప్పకుండ ననుపు పాఁతరఁబెట్టేవా
యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి మమ్మునెల్ల
అప్పటిఁ గాంతలమేలు ఆమని సేసేవా
(||pallavi||)
kaṁṭimi nem̐ḍībhāgyamu kannuladudala nemu
naṁṭuna saṁtoṣhiṁchugŏṁṭimi vo vibhum̐ḍa
(||kaṁṭi||)
mŏlagasannulamīm̐da mobi nīvu kŏnagoru
valabu kalubudīsevā āgĕgu
kilagila navvam̐gāne giligiṁche vappaḍini
naluvaṁkam̐ gūrimulu nām̐ṭu vesevā
(||kaṁṭi||)
ghanamaina pirum̐dubai kaṭṭevu mŏlanūḽḽu
galamĕlu javvanānagŏnariṁchevā
pĕnam̐gi sigguvaḍam̐ga biggĕm̐ gām̐giliṁchevu
vunigigā radibaṁṭa lŏḍubam̐gam̐ jūsevā
(||kaṁṭi||)
muppirim̐ durumuniṁḍa muḍisevu puvvulu
tappaguṁḍa nanubu pām̐taram̐bĕṭṭevā
yippuḍe śhrīveṁkaḍeśha yelidivi mammunĕlla
appaḍim̐ gāṁtalamelu āmani sesevā