Kamtimi nem deegottalu kannula pamdugalaaya

కంటిమి నేఁ డీకొత్తలు కన్నుల పండుగలాయ
Language

(॥పల్లవి॥)
కంటిమి నేఁ డీకొత్తలు కన్నుల పండుగలాయ
జంటలైన మీలోని జాణతనా లెట్టివో

(॥కంటి॥)
కోమలపు నీకాంత గుబ్బలపై మెఱుఁగులు
మోమున నీకు గళలై ముంచుకొన్నవి
యేమి సూత్రమోకాని ఇందుకునందుకు నేఁడు
తామర మొగ్గల సొంపద్దముపై నిలిచెను

(॥కంటి॥)
కడు మంచి జవరాల కనుగవతేటలు నడుమ
నడుమ మోవిమీఁద నవ్వులాయను
యెడయక యీరెంటికి నేమిగారణమోకాని
అడరి కలువలనిగ్గంటెఁ జిగురులను

(॥కంటి॥)
అలమేలుమంగ నీయండఁ బాయకుండితేను
నెలవై శ్రీవేంకటేశ నీవు గూడితి
యెలిమి నాపై నీకు నెన్నటి పొందోకాని
కలసి మెఱుఁగుదీవె కల్పకముఁజెందెను

(||pallavi||)
kaṁṭimi nem̐ ḍīgŏttalu kannula paṁḍugalāya
jaṁṭalaina mīloni jāṇadanā lĕṭṭivo

(||kaṁṭi||)
komalabu nīgāṁta gubbalabai mĕṟum̐gulu
momuna nīgu gaḽalai muṁchugŏnnavi
yemi sūtramogāni iṁdugunaṁdugu nem̐ḍu
tāmara mŏggala sŏṁpaddamubai nilisĕnu

(||kaṁṭi||)
kaḍu maṁchi javarāla kanugavadeḍalu naḍuma
naḍuma movimīm̐da navvulāyanu
yĕḍayaga yīrĕṁṭigi nemigāraṇamogāni
aḍari kaluvalaniggaṁṭĕm̐ jigurulanu

(||kaṁṭi||)
alamelumaṁga nīyaṁḍam̐ bāyaguṁḍidenu
nĕlavai śhrīveṁkaḍeśha nīvu gūḍidi
yĕlimi nābai nīgu nĕnnaḍi pŏṁdogāni
kalasi mĕṟum̐gudīvĕ kalbagamum̐jĕṁdĕnu