కంటిమి నీవల్ల నేఁడు కందువైన వేడుకలు
(॥పల్లవి॥)
కంటిమి నీవల్ల నేఁడు కందువైన వేడుకలు
పంటలై నీ కోరికలు ఫలియించేనటవే
(॥కంటి॥)
కళలుదేరీ నివె కాంత నీమొగమున
వలచిననీవిభుఁడు వచ్చెనటవే
తళుకుజెక్కుల మీఁద దైవారీఁ జెమటలు
కలికిఁచేతల నిన్నుఁ గరఁగించెవటవే
(॥కంటి॥)
ముప్పిరిగొనుచు నీమోవి పైఁ దేనియ లూరీ
అప్పుడే ఆతఁడు మాటలాడెనటవే
గొప్పలైనచన్నులపై కుంకుమరసాలు గారీ
వొప్పుగ నీజవ్వనాన నొలలాడెనటవే
(॥కంటి॥)
భావించితే నీమేనఁ బాదుకొనె సొబనము
శ్రీవేంకటేశ్వరుఁడు చెందెనటవే
నీ వలమేల్‌మంగవు నిండె సింగారాలు నీమెయి
వేవేలవిదాలు నీతో వినొదించెనటవే
(||pallavi||)
kaṁṭimi nīvalla nem̐ḍu kaṁduvaina veḍugalu
paṁṭalai nī korigalu phaliyiṁchenaḍave
(||kaṁṭi||)
kaḽaluderī nivĕ kāṁta nīmŏgamuna
valasinanīvibhum̐ḍu vachchĕnaḍave
taḽugujĕkkula mīm̐da daivārīm̐ jĕmaḍalu
kaligim̐sedala ninnum̐ garam̐giṁchĕvaḍave
(||kaṁṭi||)
muppirigŏnusu nīmovi paim̐ deniya lūrī
appuḍe ādam̐ḍu māḍalāḍĕnaḍave
gŏppalainasannulabai kuṁkumarasālu gārī
vŏppuga nījavvanāna nŏlalāḍĕnaḍave
(||kaṁṭi||)
bhāviṁchide nīmenam̐ bādugŏnĕ sŏbanamu
śhrīveṁkaḍeśhvarum̐ḍu sĕṁdĕnaḍave
nī valamelmaṁgavu niṁḍĕ siṁgārālu nīmĕyi
vevelavidālu nīdo vinŏdiṁchĕnaḍave