కంటిమి నీజాడలెల్లా కానీవయ్యా
(॥పల్లవి॥)
కంటిమి నీజాడలెల్లా కానీవయ్యా
జంటలే చాయకు వచ్చి చవిపుట్టెనా
(॥కంటి॥)
నవ్వేటి నీనవ్వులను నయగారిమాఁటలను
దివ్వెలెత్తుఁ బొద్దులాయ తెల్లవారెను
పువ్వుల వేట్ల చేత పొరుగు పోరచిచేత
దవ్వులే చేరువలై తతి వచ్చెనా
(॥కంటి॥)
వొలిసీ నొల్లములను వొడబాటుఁ బాగులను
పొలసి యమాస వోయ పున్నమ వచ్చె
తలపోఁతచేత మంచితనువు సోఁకులచేత
చలివాసి వలపులు సరివచ్చెనా
(॥కంటి॥)
యిచ్చేటి వీడెములను యితవైన ఆనలను
నచ్చినపెండ్లి నేఁడే నాగవల్లాయ
అచ్చపు శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
పచ్చిగాఁ గూడఁగా నేఁడు ఫలియించెనా
(||pallavi||)
kaṁṭimi nījāḍalĕllā kānīvayyā
jaṁṭale sāyagu vachchi savibuṭṭĕnā
(||kaṁṭi||)
navveḍi nīnavvulanu nayagārimām̐ṭalanu
divvĕlĕttum̐ bŏddulāya tĕllavārĕnu
puvvula veṭla seda pŏrugu porasiseda
davvule seruvalai tadi vachchĕnā
(||kaṁṭi||)
vŏlisī nŏllamulanu vŏḍabāḍum̐ bāgulanu
pŏlasi yamāsa voya punnama vachchĕ
talabom̐taseda maṁchidanuvu som̐kulaseda
salivāsi valabulu sarivachchĕnā
(||kaṁṭi||)
yichcheḍi vīḍĕmulanu yidavaina ānalanu
nachchinabĕṁḍli nem̐ḍe nāgavallāya
achchabu śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
pachchigām̐ gūḍam̐gā nem̐ḍu phaliyiṁchĕnā