Kamtimi neegunamellaa kannula tudala nemdu

కంటిమి నీగుణమెల్లా కన్నుల తుదల నేఁడు
Language

(॥పల్లవి॥)
కంటిమి నీగుణమెల్లా కన్నుల తుదల నేఁడు
గొంటరి చేఁతలెల్లాను కుమ్మరించే విపుడు

(॥॥)
సాదించేవానివలెనే సతిమోము చూచేవు
తోదోపులాడి యట్టే కందువలంటేవు
సోదించేబాగుననే చొచ్చే వేకతానకు
పాదుగా నెన్నిమాయలు పచరించే విపుడు

(॥॥)
సొరిఁ దిట్టేవానివలె పొలఁతితో మాటాడేవు
వొరటుచూపేయట్టు వొడివట్టేవు
సొరిది గద్దించేరీతి సొమ్ములు గొని వేసేవు
గరిమ నెన్నిసటలు కల్పించే విపుడు

(॥॥)
మెచ్చేటివానివలెనే మెలుఁతఁ గాఁగిఁలించేవు
లచ్చనలు నించేయట్టే లాలించేవు
ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యిచ్చకపుబయకారా లెన్ని సేసే విపుడు

(||pallavi||)
kaṁṭimi nīguṇamĕllā kannula tudala nem̐ḍu
gŏṁṭari sem̐talĕllānu kummariṁche vibuḍu

(||||)
sādiṁchevānivalĕne sadimomu sūsevu
todobulāḍi yaṭṭe kaṁduvalaṁṭevu
sodiṁchebāgunane sŏchche vegadānagu
pādugā nĕnnimāyalu pasariṁche vibuḍu

(||||)
sŏrim̐ diṭṭevānivalĕ pŏlam̐tido māḍāḍevu
vŏraḍusūbeyaṭṭu vŏḍivaṭṭevu
sŏridi gaddiṁcherīdi sŏmmulu gŏni vesevu
garima nĕnnisaḍalu kalbiṁche vibuḍu

(||||)
mĕchcheḍivānivalĕne mĕlum̐tam̐ gām̐gim̐liṁchevu
lachchanalu niṁcheyaṭṭe lāliṁchevu
ichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yichchagabubayagārā lĕnni sese vibuḍu