కంటిమి నీతో మేలు కాంతల మిందరమును
(॥పల్లవి॥)
కంటిమి నీతో మేలు కాంతల మిందరమును
జంటవాయ కతనితో సతమై వుండఁగదే
(॥కంటి॥)
సెలవి నవ్వు లుండఁగా చెక్కుపై చేఇఁకనేలే
మలసేనీపతితోడ మాటలాడవే
వలపు లోన నుండఁగ వట్టి యలుక లింకేల
కలయికకు రమ్మని కప్పుర మియ్యఁగదె
(॥కంటి॥)
కనుచూపు పదరంగ కాఁకలు మేనిపైనేలే
చెనకి విభునిమీఁద చేఇచాఁచవే
మనసు బాఁతిపడఁగ మంకుదనములవేల
మొనసేటిరతులకు మోవి చూపఁగదవే
(॥కంటి॥)
భావము కలశుండఁగ పంతపుమోసములేలే
శ్రీవేంకటేశ్వరుఁ గూడి చెలరేఁగవే
వాని కొఁగిట నుండఁగ వట్టితరివీపులేల
వోవరిలో నుండుమని వుంగరాన నొత్తవే
(||pallavi||)
kaṁṭimi nīdo melu kāṁtala miṁdaramunu
jaṁṭavāya kadanido sadamai vuṁḍam̐gade
(||kaṁṭi||)
sĕlavi navvu luṁḍam̐gā sĕkkubai seim̐kanele
malasenībadidoḍa māḍalāḍave
valabu lona nuṁḍam̐ga vaṭṭi yaluga liṁkela
kalayigagu rammani kappura miyyam̐gadĕ
(||kaṁṭi||)
kanusūbu padaraṁga kām̐kalu menibainele
sĕnagi vibhunimīm̐da seisām̐save
manasu bām̐tibaḍam̐ga maṁkudanamulavela
mŏnaseḍiradulagu movi sūbam̐gadave
(||kaṁṭi||)
bhāvamu kalaśhuṁḍam̐ga paṁtabumosamulele
śhrīveṁkaḍeśhvarum̐ gūḍi sĕlarem̐gave
vāni kŏm̐giḍa nuṁḍam̐ga vaṭṭidarivībulela
vovarilo nuṁḍumani vuṁgarāna nŏttave