Kamtimi nee vedugalu kaadanenaa ne ninnu

కంటిమి నీ వేడుకలు కాదనేనా నే నిన్ను
Language

(॥పల్లవి॥)
కంటిమి నీ వేడుకలు కాదనేనా నే నిన్ను
యింటివద్ద నుంచుకొని యేలుకొనవయ్యా

(॥కంటి॥)
కన్నులఁ జూచినప్పడే కాంతపై నాసలురేఁగె
యెన్నికలు మూసిదాఁచ నిఁక నేలయ్యా
చన్నుల నొరసుకొంటా సంగడికి వచ్చినాకె
నన్నుఁ జూచి వలపెంత నానఁబెట్టేవయ్యా

(॥కంటి॥)
మాటలాడినప్పడే మనసాకెపైఁబారె
యేఁటికి సిగ్గులువడే విది యేమయ్యా
గాఁటపు గోళ్లు సోఁక కానుక దానికిచ్చె
నాఁటకుఁడ నాతో నెంత నవ్వ నవ్వేవయ్యా

(॥కంటి॥)
యేకతమైనప్పడే యీకెకే నీకుఁ బొందాయ
యీకడనేల కొంకేవు యిందుకేమయ్యా
కైకొని యలమేలుమంగను నన్ను నేలితివి
నాకెంత శ్రీవేంకటేశ నమ్మి కిచ్చేవయ్యా

(||pallavi||)
kaṁṭimi nī veḍugalu kādanenā ne ninnu
yiṁṭivadda nuṁchugŏni yelugŏnavayyā

(||kaṁṭi||)
kannulam̐ jūsinappaḍe kāṁtabai nāsalurem̐gĕ
yĕnnigalu mūsidām̐sa nim̐ka nelayyā
sannula nŏrasugŏṁṭā saṁgaḍigi vachchināgĕ
nannum̐ jūsi valabĕṁta nānam̐bĕṭṭevayyā

(||kaṁṭi||)
māḍalāḍinappaḍe manasāgĕbaim̐bārĕ
yem̐ṭigi sigguluvaḍe vidi yemayyā
gām̐ṭabu goḽlu som̐ka kānuga dānigichchĕ
nām̐ṭagum̐ḍa nādo nĕṁta navva navvevayyā

(||kaṁṭi||)
yegadamainappaḍe yīgĕge nīgum̐ bŏṁdāya
yīgaḍanela kŏṁkevu yiṁdugemayyā
kaigŏni yalamelumaṁganu nannu nelidivi
nāgĕṁta śhrīveṁkaḍeśha nammi kichchevayyā