కంటిమి నీ సుద్దులెల్లఁ గడపరాయ
(॥పల్లవి॥)
కంటిమి నీ సుద్దులెల్లఁ గడపరాయ
యింటింట దారణలెక్కె నేమి చెప్పేదయ్యా
(॥కంటి॥)
కొమ్మలచేతనెల్లాను కొలువు సేయించుకొంటా
కమ్మి వలపు కొటారుగాఁ బెట్టేవు
అమ్మరో పోఁకకుఁ బుట్టెఁడాయను సిగ్గులు నేఁడు
యెమ్మెల సతులభాగ్యా లేమి చెప్పేదయ్యా
(॥కంటి॥)
జలజలోచనలతో సరసములాడుకొంటా
మొలకనవ్వులను వాములు వేసేవు
తలఁపులోని రతులు తరగని ధాన్యమాయ
యెలజవ్వనుల ముద మేమి చెప్పేదయ్యా
(॥కంటి॥)
కందువ నింతుల నిట్టే కాఁగిటఁ బెనఁగుకొంటా
చెందుచు మోవులపై లచ్చెన వెట్టేవు
అంది శ్రీవేంకటేశ నన్నలమి మెచ్చితివిట్టే
యిందరి మురిపెములు యేమి చెప్పేదయ్యా
(||pallavi||)
kaṁṭimi nī suddulĕllam̐ gaḍabarāya
yiṁṭiṁṭa dāraṇalĕkkĕ nemi sĕppedayyā
(||kaṁṭi||)
kŏmmalasedanĕllānu kŏluvu seyiṁchugŏṁṭā
kammi valabu kŏḍārugām̐ bĕṭṭevu
ammaro pom̐kagum̐ buṭṭĕm̐ḍāyanu siggulu nem̐ḍu
yĕmmĕla sadulabhāgyā lemi sĕppedayyā
(||kaṁṭi||)
jalajalosanalado sarasamulāḍugŏṁṭā
mŏlaganavvulanu vāmulu vesevu
talam̐puloni radulu taragani dhānyamāya
yĕlajavvanula muda memi sĕppedayyā
(||kaṁṭi||)
kaṁduva niṁtula niṭṭe kām̐giḍam̐ bĕnam̐gugŏṁṭā
sĕṁdusu movulabai lachchĕna vĕṭṭevu
aṁdi śhrīveṁkaḍeśha nannalami mĕchchidiviṭṭe
yiṁdari muribĕmulu yemi sĕppedayyā