Kamtimi nee suddu lellam gaaneeraa vori maa

కంటిమి నీ సుద్దు లెల్లఁ గానీరా వోరి మా
Language

(॥పల్లవి॥)
కంటిమి నీ సుద్దు లెల్లఁ గానీరా వోరి మా-
యింట నున్నప్పుడే నీ యిచ్చలు వోరి

(॥కంటిమి॥)
చెక్కు లేల పులకించే జెప్పరా వోరి నాతో
నిక్కి నిక్కి నీ నిజాలె నెరపేవు
యెక్కడికిఁ బోనివాఁడ వేరా వోరి
యిక్కడనె బుసకొట్టేవు యేఁటికిరా వోరి

(॥కంటిమి॥)
యేడది కుంకుమపూఁత యీ మేన నోరి
యేడలేనియాచారాలు యీడఁ జేతువు
ఆడి తప్పనివాఁడవు అవురా వోరి
యీడ నీ వెంట వచ్చిన దెవ్వతెరా వోరి

(॥కంటిమి॥)
తమకించే వింతలోనె తలరా వోరి నాతో
జమళి నక్క డీ మేలు చల్లేవా వోరి
అమర శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
సముకాన నీ మాఁట సమ్మతించే నోరి

(||pallavi||)
kaṁṭimi nī suddu lĕllam̐ gānīrā vori mā-
yiṁṭa nunnappuḍe nī yichchalu vori

(||kaṁṭimi||)
sĕkku lela pulagiṁche jĕpparā vori nādo
nikki nikki nī nijālĕ nĕrabevu
yĕkkaḍigim̐ bonivām̐ḍa verā vori
yikkaḍanĕ busagŏṭṭevu yem̐ṭigirā vori

(||kaṁṭimi||)
yeḍadi kuṁkumabūm̐ta yī mena nori
yeḍaleniyāsārālu yīḍam̐ jeduvu
āḍi tappanivām̐ḍavu avurā vori
yīḍa nī vĕṁṭa vachchina dĕvvadĕrā vori

(||kaṁṭimi||)
tamagiṁche viṁtalonĕ talarā vori nādo
jamaḽi nakka ḍī melu sallevā vori
amara śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
samugāna nī mām̐ṭa sammadiṁche nori