కంటిమి నీ సింగారాలు కన్నుల పండువుగాను
(॥పల్లవి॥)
కంటిమి నీ సింగారాలు కన్నుల పండువుగాను
దంటవైనందుకు నీ చందములెల్లాఁ దగునే
(॥కంటి॥)
పువ్వులు కొప్పున రాలె బుజము పై రేకలవె
యివ్వల నామోము చూచి యేమినవ్వేవే
కువ్వలాయఁ బులకలు కురిసె మేనఁ జెమట
జవ్వనివైనందుకు సప(ఫ?) లము లాయనే
(॥కంటి॥)
మోమునఁ గళలు దేరె మోమిమీఁద చేఁటులదె
చేముంచితి విఁకనేల సిగ్గువడేవే
ఆముకొనె నిట్టూర్పు లంగమునఁ బచ్చిదేరె
యామేర జాణవైనందు కిన్నియు నమరునే
(॥కంటి॥)
కలగొనె సంతోసాలు కన్నులఁ దేటలవె
అలర మాకెంతేసి ప్రియాలు చెప్పేవే
చెలఁగె నీ వేడుకలు శ్రీవేంకటేశుఁడు గూడె
అలమేలు మంగవు నీకన్నియు నీడేరెనే
(||pallavi||)
kaṁṭimi nī siṁgārālu kannula paṁḍuvugānu
daṁṭavainaṁdugu nī saṁdamulĕllām̐ dagune
(||kaṁṭi||)
puvvulu kŏppuna rālĕ bujamu pai regalavĕ
yivvala nāmomu sūsi yeminavveve
kuvvalāyam̐ bulagalu kurisĕ menam̐ jĕmaḍa
javvanivainaṁdugu saba(pha?) lamu lāyane
(||kaṁṭi||)
momunam̐ gaḽalu derĕ momimīm̐da sem̐ṭuladĕ
semuṁchidi vim̐kanela sigguvaḍeve
āmugŏnĕ niṭṭūrbu laṁgamunam̐ bachchiderĕ
yāmera jāṇavainaṁdu kinniyu namarune
(||kaṁṭi||)
kalagŏnĕ saṁtosālu kannulam̐ deḍalavĕ
alara māgĕṁtesi priyālu sĕppeve
sĕlam̐gĕ nī veḍugalu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
alamelu maṁgavu nīganniyu nīḍerĕne