కంటిమి నీ లాగులు కతలు గాను
(॥పల్లవి॥)
కంటిమి నీ లాగులు కతలు గాను
పెంటలుగాఁ గొసరేవు పెనఁగఁగఁ గలవా
(॥॥)
చూపులకే వలచేవు సుద్దులకే భ్రమసేవు
ఆపడఁతి నేరుపు లెన్నని చెప్పేము
చాపలాన బొమ్మలను జంకించితేఁ గనక
పైపై నీ చేసిన భాగ్య ఫలమిది గాదా
(॥॥)
మొక్కులకే తగిలేవు ముచ్చటకే లాచేవు
యెక్కువ నీకె పంతము లెంతమెచ్చేము
పక్కన నంతలోనే గుబ్బల నొత్తితేగనక
యిక్కువ నీ మనోరథ మీడేరుట గాదా
(॥॥)
నవ్వులకే పొదిగేవు నమ్మికలకె కూడేవు
జవ్వనిభావము యెందు సరిచూపేము
యివ్వల శ్రీవేంకటేశ యెనసె నీ కెగనక
రవ్వల నీకు మదనసామ్రాజ్యము గాదా
(||pallavi||)
kaṁṭimi nī lāgulu kadalu gānu
pĕṁṭalugām̐ gŏsarevu pĕnam̐gam̐gam̐ galavā
(||||)
sūbulage valasevu suddulage bhramasevu
ābaḍam̐ti nerubu lĕnnani sĕppemu
sābalāna bŏmmalanu jaṁkiṁchidem̐ ganaga
paibai nī sesina bhāgya phalamidi gādā
(||||)
mŏkkulage tagilevu muchchaḍage lāsevu
yĕkkuva nīgĕ paṁtamu lĕṁtamĕchchemu
pakkana naṁtalone gubbala nŏttideganaga
yikkuva nī manoratha mīḍeruḍa gādā
(||||)
navvulage pŏdigevu nammigalagĕ kūḍevu
javvanibhāvamu yĕṁdu sarisūbemu
yivvala śhrīveṁkaḍeśha yĕnasĕ nī kĕganaga
ravvala nīgu madanasāmrājyamu gādā