Kamtimi nee jaadalellaa gattigaa nemdu

కంటిమి నీ జాడలెల్లా గట్టిగా నేఁడు
Language

(॥పల్లవి॥)
కంటిమి నీ జాడలెల్లా గట్టిగా నేఁడు
జంటయై నీవలపులు చల్లుదువు గాక

(॥॥)
చెలఁగి యాపె పలుకు చెవిసోఁకెను
మెలఁగి మరి పాదము మేను సోఁకెను
చెలువుఁడ చెప్పినట్టు సేసేవా మాకు
సొలసి నీయెమ్మెలెల్లాఁ జూపుదువు గాక

(॥॥)
సతిమోవి తేనెపెర సరి వచ్చెను
రతులనే యాపెఁ గూడ తతి వచ్చెను
యితవయ్యీనా మాతో యేలాటాలు
అతిరాజసపు దొరవవుదువు గాక

(॥॥)
చేకొన్న యాపెకానికె చేయి నిండెను
లాకలఁ బుక్కిలి తములము నిండెను
కైకొనేలితివి శ్రీవేంకటేశ నన్ను
వాకముగా నాకు నిట్టే వలతువు గాక

(||pallavi||)
kaṁṭimi nī jāḍalĕllā gaṭṭigā nem̐ḍu
jaṁṭayai nīvalabulu salluduvu gāga

(||||)
sĕlam̐gi yābĕ palugu sĕvisom̐kĕnu
mĕlam̐gi mari pādamu menu som̐kĕnu
sĕluvum̐ḍa sĕppinaṭṭu sesevā māgu
sŏlasi nīyĕmmĕlĕllām̐ jūbuduvu gāga

(||||)
sadimovi tenĕbĕra sari vachchĕnu
radulane yābĕm̐ gūḍa tadi vachchĕnu
yidavayyīnā mādo yelāḍālu
adirājasabu dŏravavuduvu gāga

(||||)
segŏnna yābĕgānigĕ seyi niṁḍĕnu
lāgalam̐ bukkili tamulamu niṁḍĕnu
kaigŏnelidivi śhrīveṁkaḍeśha nannu
vāgamugā nāgu niṭṭe valaduvu gāga