Kamtimi nee gunamellaa kaaneeleraa ninnu

కంటిమి నీ గుణమెల్లా కానీలేరా నిన్ను
Language

(॥పల్లవి॥)
కంటిమి నీ గుణమెల్లా కానీలేరా నిన్ను
నంటుకోనిచ్చినదాని కది వద్దలా

(॥కంటిమి॥)
యెక్కడెక్కడో కోప మెవ్వరిమీఁదనో వేసి
యిక్కువ లంటితే నన్ను యీసడించేవు
గుక్కుచు కూడు వేఁడెయితే కూరపై చేఁ చాచినట్టు
మక్కళింపువెడమాయ మామీఁదనో వోరి

(॥కంటిమి॥)
మనసులోపలిచింత మాటలలోనఁ బొదిగీ
చెనకితే నామీఁద చిమ్మి రేఁగేవు
గొనకొన్నజవ్వనము కుచములై వెళ్ళినట్లు
మని మని నేరుపు మామీఁదనా వోరి

(॥కంటిమి॥)
కాయముమీఁదటికాఁక కనుఁగొనల కెక్కించి
చాయల నేఁ గూడఁ గానే చల్ల నయ్యేవు
పాయపు శ్రీవేంకటేశ పరుసము సోఁకినట్టు
మాయని నీ మహిమలు మామీఁదనా వోరి

(||pallavi||)
kaṁṭimi nī guṇamĕllā kānīlerā ninnu
naṁṭugonichchinadāni kadi vaddalā

(||kaṁṭimi||)
yĕkkaḍĕkkaḍo koba mĕvvarimīm̐dano vesi
yikkuva laṁṭide nannu yīsaḍiṁchevu
gukkusu kūḍu vem̐ḍĕyide kūrabai sem̐ sāsinaṭṭu
makkaḽiṁpuvĕḍamāya māmīm̐dano vori

(||kaṁṭimi||)
manasulobalisiṁta māḍalalonam̐ bŏdigī
sĕnagide nāmīm̐da simmi rem̐gevu
gŏnagŏnnajavvanamu kusamulai vĕḽḽinaṭlu
mani mani nerubu māmīm̐danā vori

(||kaṁṭimi||)
kāyamumīm̐daḍigām̐ka kanum̐gŏnala kĕkkiṁchi
sāyala nem̐ gūḍam̐ gāne salla nayyevu
pāyabu śhrīveṁkaḍeśha parusamu som̐kinaṭṭu
māyani nī mahimalu māmīm̐danā vori