కంటిమి మిమ్మిందరిని కన్నుల తుదల నేఁడు
(॥పల్లవి॥)
కంటిమి మిమ్మిందరిని కన్నుల తుదల నేఁడు
తొంటి వినుకులకు సంతోసమాయ నయ్యా
(॥కంటి॥)
చూపులనే ఆకె నీకు సుద్దులెల్లాఁ జెప్పెను
ఆపనులు యింకానేమి అడిగేవయ్యా
కైపుసేయకందుకుఁగాఁ గాఁగిలించుకొంటివి
చాపలాన రెంటికిని సరియాయ నయ్యా
(॥కంటి॥)
నవ్వులనే నీకు వినయములెల్లాఁ జూపె
తవ్వుచు నప్పటి నేమి దడవేవయ్యా
చివ్వన నందుకుఁగాను చెక్కులు నొక్కితివి
యివ్వల నందుకిందుకు నీడువచ్చెనయ్యా
(॥కంటి॥)
మంతనాన నలమేలుమంగ నీకు మొక్కి కూడె
వంతుకు నన్నేలి యెంత వలచేవయ్యా
అంతలో శ్రీవేంకటేశ అందుకే లాలించితివి
కాంతుఁడవన్నిటాఁ దారుకాణ వచ్చెనయ్యా
(||pallavi||)
kaṁṭimi mimmiṁdarini kannula tudala nem̐ḍu
tŏṁṭi vinugulagu saṁtosamāya nayyā
(||kaṁṭi||)
sūbulane āgĕ nīgu suddulĕllām̐ jĕppĕnu
ābanulu yiṁkānemi aḍigevayyā
kaibuseyagaṁdugum̐gām̐ gām̐giliṁchugŏṁṭivi
sābalāna rĕṁṭigini sariyāya nayyā
(||kaṁṭi||)
navvulane nīgu vinayamulĕllām̐ jūbĕ
tavvusu nappaḍi nemi daḍavevayyā
sivvana naṁdugum̐gānu sĕkkulu nŏkkidivi
yivvala naṁdugiṁdugu nīḍuvachchĕnayyā
(||kaṁṭi||)
maṁtanāna nalamelumaṁga nīgu mŏkki kūḍĕ
vaṁtugu nanneli yĕṁta valasevayyā
aṁtalo śhrīveṁkaḍeśha aṁduge lāliṁchidivi
kāṁtum̐ḍavanniḍām̐ dārugāṇa vachchĕnayyā