Kamtimi mee iddaremdu kattina yechcharigelu

కంటిమి మీ ఇద్దరెందు కట్టిన యెచ్చరికెలు
Language

(॥పల్లవి॥)
కంటిమి మీ ఇద్దరెందు కట్టిన యెచ్చరికెలు
జంటలై వున్నందుకును చలము లెచ్చరికె

(॥కంటి॥)
చెలిమిసేసేయందుకు చెనకులే యెచ్చరికె
యెలయింపులకు సన్న లెచ్చరికె
వలపులకును తలవంపులే యెచ్చరికె
పిలిచి చేకొనుటకు పెనఁగు లెచ్చరికె

(॥కంటి॥)
ముందర నిలుచుటకు మొక్కలే యెచ్చరికె
యెందుకును సరసము లెచ్చరికె
కందువల నుండుటకు కతలే యెచ్చరికె
చిందేటికరఁగులకు సిగ్గులే యెచ్చరికె

(॥కంటి॥)
కదిసి కూడుటకును కాఁగిలే యెచ్చరికె
హృదయాలకు నవ్వులే యెచ్చరికె
అదన శ్రీవేంకటేశుఁ డన్నిటా నిన్ను నెనసె
ముదములకు నప్పటిముచ్చట లెచ్చరికె

(||pallavi||)
kaṁṭimi mī iddarĕṁdu kaṭṭina yĕchcharigĕlu
jaṁṭalai vunnaṁdugunu salamu lĕchcharigĕ

(||kaṁṭi||)
sĕlimiseseyaṁdugu sĕnagule yĕchcharigĕ
yĕlayiṁpulagu sanna lĕchcharigĕ
valabulagunu talavaṁpule yĕchcharigĕ
pilisi segŏnuḍagu pĕnam̐gu lĕchcharigĕ

(||kaṁṭi||)
muṁdara nilusuḍagu mŏkkale yĕchcharigĕ
yĕṁdugunu sarasamu lĕchcharigĕ
kaṁduvala nuṁḍuḍagu kadale yĕchcharigĕ
siṁdeḍigaram̐gulagu siggule yĕchcharigĕ

(||kaṁṭi||)
kadisi kūḍuḍagunu kām̐gile yĕchcharigĕ
hṛdayālagu navvule yĕchcharigĕ
adana śhrīveṁkaḍeśhum̐ ḍanniḍā ninnu nĕnasĕ
mudamulagu nappaḍimuchchaḍa lĕchcharigĕ