కంటిమి మీ భాగ్యము కన్నులతుదల నేము
(॥పల్లవి॥)
కంటిమి మీ భాగ్యము కన్నులతుదల నేము
జంటల మీ సొబగులు సందడించఁ జొచ్చెను
(॥కంటిమి॥)
తప్పక నీవు చూచితే తరుణి మేననెల్ల
ముప్పిరి గాఁ జెమటలు ముంచఁ జొచ్చెను
చిప్పిల మాటాడితేనే చెలి మారుమాటలలో
వుప్పతిల్లు మోవితేనెలూరఁ జొచ్చెను
(॥కంటిమి॥)
ననుపుగా నవ్వితేనే నలినాక్షిచెక్కులను
నినుపులై పులకలు నిండఁ జొచ్చెను
చెనకుచు నీవంతలో చేతులు చాఁచఁగాను
వనితపోఁకముడి వదలఁగఁ జొచ్చెను
(॥కంటిమి॥)
తొడపై నిడుకొంటేనే తొయ్యలికుచగిరులు
తడఁబడ మేలుకు నదరఁజొచ్చెను
అడరి శ్రీవేంకటేశ అంగన నిట్టే కూడితే
జడిగొన్నకళలు మించఁగఁ జొచ్చెను
(||pallavi||)
kaṁṭimi mī bhāgyamu kannuladudala nemu
jaṁṭala mī sŏbagulu saṁdaḍiṁcham̐ jŏchchĕnu
(||kaṁṭimi||)
tappaga nīvu sūside taruṇi menanĕlla
muppiri gām̐ jĕmaḍalu muṁcham̐ jŏchchĕnu
sippila māḍāḍidene sĕli mārumāḍalalo
vuppadillu movidenĕlūram̐ jŏchchĕnu
(||kaṁṭimi||)
nanubugā navvidene nalinākṣhisĕkkulanu
ninubulai pulagalu niṁḍam̐ jŏchchĕnu
sĕnagusu nīvaṁtalo sedulu sām̐sam̐gānu
vanidabom̐kamuḍi vadalam̐gam̐ jŏchchĕnu
(||kaṁṭimi||)
tŏḍabai niḍugŏṁṭene tŏyyaligusagirulu
taḍam̐baḍa melugu nadaram̐jŏchchĕnu
aḍari śhrīveṁkaḍeśha aṁgana niṭṭe kūḍide
jaḍigŏnnagaḽalu miṁcham̐gam̐ jŏchchĕnu