Kamtimi kottalu gonni kannulabamdugagaanu

కంటిమి కొత్తలు గొన్ని కన్నులపండుగగాను
Language

(॥పల్లవి॥)
కంటిమి కొత్తలు గొన్ని కన్నులపండుగగాను
అంటితివో లేదో నాతో నానతీవయ్యా

(॥॥)
చనవరిమాటలు సారెకు నీతో నాడి
చెనకీ నెవ్వతో కాని చెలి నిన్ను
తనివోనియాసలతో తగులువిరితనాన
పెనఁగులాడుతా నీపైఁ బ్రేమము చల్లీని

(॥॥)
సందడిఁ దానేమౌనో సరసనే కూచుండి
అంది విడేలియ్యనవచ్చీ నప్పటి నీకు
మందెమేళాలు సేసుక మలసి సొలసి నవ్వి
సందుసుడిఁ దనమోవిచౌలు చూపీని

(॥॥)
పచ్చిదేర నాడానీడా పంచలఁ బొలసుకొంటా
యెచ్చరిక లేల సేసీ నేమీ యాపె
యిచ్చట శ్రీ వేంకటేశ యేలితిని నన్ను నేఁడు
నచ్చుకొట్టుతాఁ గొంత నవ్వఁ గ లాచీని

(||pallavi||)
kaṁṭimi kŏttalu gŏnni kannulabaṁḍugagānu
aṁṭidivo ledo nādo nānadīvayyā

(||||)
sanavarimāḍalu sārĕgu nīdo nāḍi
sĕnagī nĕvvado kāni sĕli ninnu
tanivoniyāsalado taguluviridanāna
pĕnam̐gulāḍudā nībaim̐ bremamu sallīni

(||||)
saṁdaḍim̐ dānemauno sarasane kūsuṁḍi
aṁdi viḍeliyyanavachchī nappaḍi nīgu
maṁdĕmeḽālu sesuga malasi sŏlasi navvi
saṁdusuḍim̐ danamovisaulu sūbīni

(||||)
pachchidera nāḍānīḍā paṁchalam̐ bŏlasugŏṁṭā
yĕchchariga lela sesī nemī yābĕ
yichchaḍa śhrī veṁkaḍeśha yelidini nannu nem̐ḍu
nachchugŏṭṭudām̐ gŏṁta navvam̐ ga lāsīni