Kamtime yinnaallagu meegaampuraalu kannulaaraa

కంటిమే యిన్నాళ్లకు మీకాఁపురాలు కన్నులారా
Language

(॥పల్లవి॥)
కంటిమే యిన్నాళ్లకు మీకాఁపురాలు కన్నులారా
జంటలై మీ కోరికలు సతమాయఁగదరే

(॥కంటి॥)
మొలకనవ్వుల మీరు మోములు చూచుకోఁగా
తెలిసెనే మీపొందులు తెల్లమిగాను
చలివాసి మీలోన సరసము లాడుకోఁగా
వెలిసెనే సబలొ మీవేడుకలెల్లాను

(॥కంటి॥)
పగటున మీరిద్దరు పానపుపై గూచుండఁగ
నెగడెనే యీకొత్తలు నేఁడింతటాను
వెగటులేక మీరు విడెము లందుకోఁగా
తగులై మేభోగా లీడఁ దరితీపులాయనే

(॥కంటి॥)
శ్రీవేంకటేశుఁడు నీవు చెలఁగి పెండ్లాడఁగాను
చేవదేరేనే మీచేఁతలెల్లాను
మోవులసన్నల మీరు ముచ్చట లాడుకోఁగా
వేవేలై నిలిచెనే మీవినోదములెల్లాను

(||pallavi||)
kaṁṭime yinnāḽlagu mīgām̐purālu kannulārā
jaṁṭalai mī korigalu sadamāyam̐gadare

(||kaṁṭi||)
mŏlaganavvula mīru momulu sūsugom̐gā
tĕlisĕne mībŏṁdulu tĕllamigānu
salivāsi mīlona sarasamu lāḍugom̐gā
vĕlisĕne sabalŏ mīveḍugalĕllānu

(||kaṁṭi||)
pagaḍuna mīriddaru pānabubai gūsuṁḍam̐ga
nĕgaḍĕne yīgŏttalu nem̐ḍiṁtaḍānu
vĕgaḍulega mīru viḍĕmu laṁdugom̐gā
tagulai mebhogā līḍam̐ daridībulāyane

(||kaṁṭi||)
śhrīveṁkaḍeśhum̐ḍu nīvu sĕlam̐gi pĕṁḍlāḍam̐gānu
sevaderene mīsem̐talĕllānu
movulasannala mīru muchchaḍa lāḍugom̐gā
vevelai nilisĕne mīvinodamulĕllānu