Kamtime neevalla nittigadalelaallanu

కంటిమే నీవల్ల నిట్టికతలెలాల్లను
Language

(॥పల్లవి॥)
కంటిమే నీవల్ల నిట్టికతలెలాల్లను
వెంటవెంట వచ్చి కడువేసాలు చూపేవు

(॥॥)
కాటుకకన్నులతోడ కరుచు రమణుని
సూటిదప్పకుండా నేమిచూచేవే నీవు
నేటనే కడమాయనా నీయాసోద మెంతలేదు
మేటివై యిందరిలోనా మేకులుసేసేవు

(॥॥)
కానుకగా మోవిమీఁద కప్పుచుఁ దమ్ములమ్మున
నానఁబెట్టి యిప్పుడేమి నవ్వునవ్వేవే
కానరాదా నీవలపు కలయవేసేవు పొందు
పూని నీపెద్దరిక మిప్పుడే నెరసేవు

(॥॥)
కంకణాలచేతులను కాఁగిటను బిగియించి
మంకవై యీవేళనేల మాటలాడేవే
కొంకక యలమేల్మంగ కూడె శ్రీవేంకటేశుఁడు
జంకెనరతుల నెంత జాగులఁబెట్టేవే

(||pallavi||)
kaṁṭime nīvalla niṭṭigadalĕlāllanu
vĕṁṭavĕṁṭa vachchi kaḍuvesālu sūbevu

(||||)
kāḍugagannuladoḍa karusu ramaṇuni
sūḍidappaguṁḍā nemisūseve nīvu
neḍane kaḍamāyanā nīyāsoda mĕṁtaledu
meḍivai yiṁdarilonā megulusesevu

(||||)
kānugagā movimīm̐da kappusum̐ dammulammuna
nānam̐bĕṭṭi yippuḍemi navvunavveve
kānarādā nīvalabu kalayavesevu pŏṁdu
pūni nībĕddariga mippuḍe nĕrasevu

(||||)
kaṁkaṇālasedulanu kām̐giḍanu bigiyiṁchi
maṁkavai yīveḽanela māḍalāḍeve
kŏṁkaga yalamelmaṁga kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
jaṁkĕnaradula nĕṁta jāgulam̐bĕṭṭeve