కంటిమే నీ యెమ్మెలెల్లాఁ గన్నులారాను
(॥పల్లవి॥)
కంటిమే నీ యెమ్మెలెల్లాఁ గన్నులారాను
యింటిలోనుండే సతుల కింత రట్టు వలెనా
(॥కంటి॥)
చక్కనిదాన వౌదువే సరసురాల వౌదువే
పిక్కటిల్లుపిరుఁదుల పెద్ద వౌదువే
పక్కన నీ మురిపెము పతి ముందరఁ జూపేవు
నెక్కొని యీ కాంతలెల్లా నీకొలఁదివారా
(॥కంటి॥)
పుప్పొడి చల్లుకొంటివే పువ్వులు ముడిచితివే
కొప్పు నిక్కఁబెట్టుకొని గురియైతివే
చొప్పుగా నీ సింగారాలే చూపే వీతని యెదుట
యిప్పు డీ కొమ్మలలో నీ వెవ్వరిఁ బోలుదువే
(॥కంటి॥)
సొలపులఁ జూచేవే జూటవై మెరసేవే
కలికితనాలె యెంత కడుఁ జూపేవే
అలమె శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
యెలనాగ విందరిలో నెవ్వరిఁ బోలుదువే
(||pallavi||)
kaṁṭime nī yĕmmĕlĕllām̐ gannulārānu
yiṁṭilonuṁḍe sadula kiṁta raṭṭu valĕnā
(||kaṁṭi||)
sakkanidāna vauduve sarasurāla vauduve
pikkaḍillubirum̐dula pĕdda vauduve
pakkana nī muribĕmu padi muṁdaram̐ jūbevu
nĕkkŏni yī kāṁtalĕllā nīgŏlam̐divārā
(||kaṁṭi||)
puppŏḍi sallugŏṁṭive puvvulu muḍisidive
kŏppu nikkam̐bĕṭṭugŏni guriyaidive
sŏppugā nī siṁgārāle sūbe vīdani yĕduḍa
yippu ḍī kŏmmalalo nī vĕvvarim̐ boluduve
(||kaṁṭi||)
sŏlabulam̐ jūseve jūḍavai mĕraseve
kaligidanālĕ yĕṁta kaḍum̐ jūbeve
alamĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
yĕlanāga viṁdarilo nĕvvarim̐ boluduve