కంటిమయ్యా యీభాగ్యము కన్నులతుదల నేము
(॥పల్లవి॥)
కంటిమయ్యా యీభాగ్యము కన్నులతుదల నేము
జంటలై బదుకరయ్య చల్లగా నిద్దరును
(॥॥)
పెదవితేనియ లాని పిరుఁదుపైఁ జెయివేసి
వదలించితివి నీవి వనితకు
పొదిగి చన్నుల నూఁది బుగబుగఁ జెమరించి
మదము గురియఁ జోచ్చె మానిని నీమీఁదను
(॥॥)
పుక్కిటివిడియ మిచ్చి పొందుగాఁ గాఁగిలించి
చెక్కుఁ జెక్కు మోపితివి చెలియకు
తొక్కిన పాదముతోడ తొడఁ దొడఁ గీలించి
ముక్కున నూర్పు విసరీ ముదిత నీమీఁ దను
(॥॥)
పచ్చడము పైఁగప్పి పలురతులనుఁ గూడి
మెచ్చితి వలమేలుమంగకు
అచ్చమై శ్రీ వేంకటేశ అన్నిటా నిన్నుఁ జొక్కించి
లచ్చనలు నించఁ జొచ్చె లలన నీమీఁ దను
(||pallavi||)
kaṁṭimayyā yībhāgyamu kannuladudala nemu
jaṁṭalai badugarayya sallagā niddarunu
(||||)
pĕdavideniya lāni pirum̐dubaim̐ jĕyivesi
vadaliṁchidivi nīvi vanidagu
pŏdigi sannula nūm̐di bugabugam̐ jĕmariṁchi
madamu guriyam̐ jochchĕ mānini nīmīm̐danu
(||||)
pukkiḍiviḍiya michchi pŏṁdugām̐ gām̐giliṁchi
sĕkkum̐ jĕkku mobidivi sĕliyagu
tŏkkina pādamudoḍa tŏḍam̐ dŏḍam̐ gīliṁchi
mukkuna nūrbu visarī mudida nīmīm̐ danu
(||||)
pachchaḍamu paim̐gappi paluradulanum̐ gūḍi
mĕchchidi valamelumaṁgagu
achchamai śhrī veṁkaḍeśha anniḍā ninnum̐ jŏkkiṁchi
lachchanalu niṁcham̐ jŏchchĕ lalana nīmīm̐ danu