Kamtimayyaa nee suddulu kadalugaanu

కంటిమయ్యా నీ సుద్దులు కతలుగాను
Language

(॥పల్లవి॥)
కంటిమయ్యా నీ సుద్దులు కతలుగాను
ఇంటిపొరుగువారిపై నింపులు చల్లేవు

(॥॥)
మలసి కొంగువట్టేవు మగువ దండ నుండఁగా
మొలకచన్నులు నిన్ను మోచెనంటాను
యెలమిఁ బెండ్లాడినెపె నేమిసేతువో యిఁక
చెలిమిక త్తెలమీఁద చేతులు చాఁచేవు

(॥॥)
బడినే కానుకిచ్చితే పచ్చడము గప్పేవు
పడఁతికొనగోరు నీపై సోఁకెనంటా
అడరి వుంకువవెట్టినాపె నెంత చిక్కింతువో
నడుమచుట్టాలమీఁద ననుపు చూపేవు

(॥॥)
కలసితివి సతిని గక్కన శ్రీవేంకటేశ
అలివేణిచూపులు నిన్నంటెనంటాను
యెలమి మేనవారైతే యెంత దక్కఁగొందువో
కనగొన పేరటాండ్లఁ గాఁగిలించేవు

(||pallavi||)
kaṁṭimayyā nī suddulu kadalugānu
iṁṭibŏruguvāribai niṁpulu sallevu

(||||)
malasi kŏṁguvaṭṭevu maguva daṁḍa nuṁḍam̐gā
mŏlagasannulu ninnu mosĕnaṁṭānu
yĕlamim̐ bĕṁḍlāḍinĕbĕ nemiseduvo yim̐ka
sĕlimiga ttĕlamīm̐da sedulu sām̐sevu

(||||)
baḍine kānugichchide pachchaḍamu gappevu
paḍam̐tigŏnagoru nībai som̐kĕnaṁṭā
aḍari vuṁkuvavĕṭṭinābĕ nĕṁta sikkiṁtuvo
naḍumasuṭṭālamīm̐da nanubu sūbevu

(||||)
kalasidivi sadini gakkana śhrīveṁkaḍeśha
aliveṇisūbulu ninnaṁṭĕnaṁṭānu
yĕlami menavāraide yĕṁta dakkam̐gŏṁduvo
kanagŏna peraḍāṁḍlam̐ gām̐giliṁchevu