కంటిమయ్యా నీ చేఁతలు కన్నులతుదల నేఁడు
(॥పల్లవి॥)
కంటిమయ్యా నీ చేఁతలు కన్నులతుదల నేఁడు
నంటున లేదంటానే ఆనలు వెట్టుకోనేవు
(॥కంటి॥)
పైపై నీవెక్కడనో పరాకై వుండితేను
ఆపె నీ మొగము చూచీ నంతలోనను
దాపుగా నప్పటి నీవు తనదిక్కు చూచితేను
రాపుగా సిగ్గుతోడ శిరసు వంచుకొనీని
(॥కంటి॥)
వొద్ది మలగుపైవి వొరఁగి నిద్రించితేను
అద్దుకొనీఁ జన్నుల నీయందపుఁజేయి
నిద్దిరించే దానివలె నెమ్మిఁ గన్నులు మూసితే
తిద్దే వాపెహారమును తేటతెల్లమిగను
(॥కంటి॥)
నన్నుఁ గాఁగిలించుకొని నాతో నీవు మాటాడంగా
సన్నల మోవి చూపీని సారెకు నాపె
ఇన్నిటా శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
మిన్న కాపెకతలకు మింగకు గుక్కిళ్ళు
(||pallavi||)
kaṁṭimayyā nī sem̐talu kannuladudala nem̐ḍu
naṁṭuna ledaṁṭāne ānalu vĕṭṭugonevu
(||kaṁṭi||)
paibai nīvĕkkaḍano parāgai vuṁḍidenu
ābĕ nī mŏgamu sūsī naṁtalonanu
dābugā nappaḍi nīvu tanadikku sūsidenu
rābugā siggudoḍa śhirasu vaṁchugŏnīni
(||kaṁṭi||)
vŏddi malagubaivi vŏram̐gi nidriṁchidenu
addugŏnīm̐ jannula nīyaṁdabum̐jeyi
niddiriṁche dānivalĕ nĕmmim̐ gannulu mūside
tidde vābĕhāramunu teḍadĕllamiganu
(||kaṁṭi||)
nannum̐ gām̐giliṁchugŏni nādo nīvu māḍāḍaṁgā
sannala movi sūbīni sārĕgu nābĕ
inniḍā śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
minna kābĕgadalagu miṁgagu gukkiḽḽu