Kamtimayya yee bhaagyamu kadaluga nitte nemdu

కంటిమయ్య యీ భాగ్యము కతలుగ నిట్టే నేఁడు
Language

(॥పల్లవి॥)
కంటిమయ్య యీ భాగ్యము కతలుగ నిట్టే నేఁడు
జంటలాయ వేడుకలు సరికి బేసికిని

(॥॥)
చెలువుఁడ నీవిట్టే చేతికి లోనై యుండఁగ
వలపులు చవులాయ వాడలోనెల్లా
యెలమి నీవు కన్నులయెదుటనే వుండఁగాను
తలపోఁతలీడేరెఁ దారుకాణలుగను

(॥॥)
అమరఁ గాఁపురము నీవట్టే మాతోఁ జేయఁగాను
తమకమగ్గువాయ చెంతలనెల్లాను
మమకారమున నీవే మాటలట్టే యాడఁగాను
ప్రమదపుటాస హెచ్చె భావించినట్టెల్లాను

(॥॥)
గతిగూడి నీవు నన్ను గాఁగిలించుకొనఁగాను
రతులెంతే వెలవెట్టె రాతిరెల్లాను
యితవై శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టే
సతమాయఁ బులకలు చల్లువెదలుగను

(||pallavi||)
kaṁṭimayya yī bhāgyamu kadaluga niṭṭe nem̐ḍu
jaṁṭalāya veḍugalu sarigi besigini

(||||)
sĕluvum̐ḍa nīviṭṭe sedigi lonai yuṁḍam̐ga
valabulu savulāya vāḍalonĕllā
yĕlami nīvu kannulayĕduḍane vuṁḍam̐gānu
talabom̐talīḍerĕm̐ dārugāṇaluganu

(||||)
amaram̐ gām̐puramu nīvaṭṭe mādom̐ jeyam̐gānu
tamagamagguvāya sĕṁtalanĕllānu
mamagāramuna nīve māḍalaṭṭe yāḍam̐gānu
pramadabuḍāsa hĕchchĕ bhāviṁchinaṭṭĕllānu

(||||)
gadigūḍi nīvu nannu gām̐giliṁchugŏnam̐gānu
radulĕṁte vĕlavĕṭṭĕ rādirĕllānu
yidavai śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭe
sadamāyam̐ bulagalu salluvĕdaluganu