కంటిమయ్య నీచేఁతలు కన్నులపండుగగాను
(॥పల్లవి॥)
కంటిమయ్య నీచేఁతలు కన్నులపండుగగాను
పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు
(॥॥)
మంతనమాడేటివేళ మజ్జనమాడేటివేళ
ఇంతితోడి సరసము లింపులు నీకు
అంతలోఁ గప్పురకాపు అవధరించేటివేళ
సంతతపు వసంతము చవులు నీకు
(॥॥)
పొందులవేళలఁ దట్టుపుణుఁగు పూసేటివేళ
ఇందుముఖితోడిమాట లితవు నీకు
చెందమ్మి పూవుదండలు సింగారించుకొనేవేళ
విందుల మోవియీవులు వేడుక నీకు
(॥॥)
సొలసి నవ్వేటివేళ సొమ్ము లిడుకొనేవేళ
అలమేల్మంగకూటమి అనువు నీకు
యెలమి శ్రీ వేంకటేశ ఇద్దరుఁ బెండ్లాడేవేళ
కొలువులోని మొక్కులు కొసరు నీకు
(||pallavi||)
kaṁṭimayya nīsem̐talu kannulabaṁḍugagānu
pĕṁṭalaina muchchaḍale priyamu nīgu
(||||)
maṁtanamāḍeḍiveḽa majjanamāḍeḍiveḽa
iṁtidoḍi sarasamu liṁpulu nīgu
aṁtalom̐ gappuragābu avadhariṁcheḍiveḽa
saṁtadabu vasaṁtamu savulu nīgu
(||||)
pŏṁdulaveḽalam̐ daṭṭubuṇum̐gu pūseḍiveḽa
iṁdumukhidoḍimāḍa lidavu nīgu
sĕṁdammi pūvudaṁḍalu siṁgāriṁchugŏneveḽa
viṁdula moviyīvulu veḍuga nīgu
(||||)
sŏlasi navveḍiveḽa sŏmmu liḍugŏneveḽa
alamelmaṁgagūḍami anuvu nīgu
yĕlami śhrī veṁkaḍeśha iddarum̐ bĕṁḍlāḍeveḽa
kŏluvuloni mŏkkulu kŏsaru nīgu