Kamtimannee nibudugaa kannulabamduga gaanu

కంటిమన్నీ నిపుడుగా కన్నులపండుగ గాను
Language

(॥పల్లవి॥)
కంటిమన్నీ నిపుడుగా కన్నులపండుగ గాను
గొంటరి వెన్నెలతీగె కొనవలె నుండెను

(॥కంటి॥)
చిత్తిరుపతిమవంటిచెలికిఁ బ్రాణము వచ్చె
హత్తి నీవు చేచేత నంటఁగాను
బత్తి నే మెంతశై త్యోపచారాలు సేసినాను
మత్తిలి లోలోనే తాను మానువలె నుండెను

(॥కంటి॥)
బంగారుబొమ్మవంట్టిడఁతి మాటలాడె
సంగడి నీవు గూచుండి చన వియ్యఁగా
ముంగిట నే మిందాఁకా ముచ్చట లెంతాడినాను
రంగు మీరినటువంటి రాయివలె నుండెను

(॥కంటి॥)
వడి కప్పురకరుగువంటిచెలి నిన్ను మెచ్చె
తొడిఁబడ నీవు గూడి తుద కెక్కఁగా
అడరి శ్రీ వేంకటేశ అండ నుండి నే మెంత న్నా
బడినే వూరకే నిమ్మపండువలె నుండెను

(||pallavi||)
kaṁṭimannī nibuḍugā kannulabaṁḍuga gānu
gŏṁṭari vĕnnĕladīgĕ kŏnavalĕ nuṁḍĕnu

(||kaṁṭi||)
sittirubadimavaṁṭisĕligim̐ brāṇamu vachchĕ
hatti nīvu seseda naṁṭam̐gānu
batti ne mĕṁtaśhai tyobasārālu sesinānu
mattili lolone tānu mānuvalĕ nuṁḍĕnu

(||kaṁṭi||)
baṁgārubŏmmavaṁṭṭiḍam̐ti māḍalāḍĕ
saṁgaḍi nīvu gūsuṁḍi sana viyyam̐gā
muṁgiḍa ne miṁdām̐kā muchchaḍa lĕṁtāḍinānu
raṁgu mīrinaḍuvaṁṭi rāyivalĕ nuṁḍĕnu

(||kaṁṭi||)
vaḍi kappuragaruguvaṁṭisĕli ninnu mĕchchĕ
tŏḍim̐baḍa nīvu gūḍi tuda kĕkkam̐gā
aḍari śhrī veṁkaḍeśha aṁḍa nuṁḍi ne mĕṁta nnā
baḍine vūrage nimmabaṁḍuvalĕ nuṁḍĕnu