Kamtimamma yinnaallagu kadalugaa mee suddulu

కంటిమమ్మ యిన్నాళ్లకు కతలుగా మీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
కంటిమమ్మ యిన్నాళ్లకు కతలుగా మీ సుద్దులు
జంటలైన ఇటువంటి చనవు గలిగెనా

(॥॥)
చేయిమీఁదఁ జేయివేసి చెక్కునొక్కేవు విభుని
చాయల నాతఁ డింతేసి చనవిచ్చెనా
ఆయములంటి యాతని నప్పటి గొరనూఁదేవు
పాయక ఇద్దరికిని పాటి(త)చుట్టరికమా

(॥॥)
మంతనాన నాతనిని మాటలోనే తిప్పేవు
పంతన నీకిటువంటిబాస సేసెనా
బంతినే మీపై మీరు పాదాలు చాఁచుకొనేరు
సంతతము మీ కిట్టిసంగాతాలా

(॥॥)
చేరి శ్రీ వేంకటేశ్వరు చెలరేఁగి కూడేవు
నేరుపు లీతఁ డిన్నేసి నీకు నేర్పెనా
యీరీతిఁ దా నన్ను నేలె ఇందుకే నీవు మెచ్చేవు
కారణాలు మీకు మీకుఁ గలిగినవా

(||pallavi||)
kaṁṭimamma yinnāḽlagu kadalugā mī suddulu
jaṁṭalaina iḍuvaṁṭi sanavu galigĕnā

(||||)
seyimīm̐dam̐ jeyivesi sĕkkunŏkkevu vibhuni
sāyala nādam̐ ḍiṁtesi sanavichchĕnā
āyamulaṁṭi yādani nappaḍi gŏranūm̐devu
pāyaga iddarigini pāḍi(ta)suṭṭarigamā

(||||)
maṁtanāna nādanini māḍalone tippevu
paṁtana nīgiḍuvaṁṭibāsa sesĕnā
baṁtine mībai mīru pādālu sām̐sugŏneru
saṁtadamu mī kiṭṭisaṁgādālā

(||||)
seri śhrī veṁkaḍeśhvaru sĕlarem̐gi kūḍevu
nerubu līdam̐ ḍinnesi nīgu nerbĕnā
yīrīdim̐ dā nannu nelĕ iṁduge nīvu mĕchchevu
kāraṇālu mīgu mīgum̐ galiginavā