కంటిఁ గంటి నీవిద్యలు కానీలేరా
(॥పల్లవి॥)
కంటిఁ గంటి నీవిద్యలు కానీలేరా
కంటమాల యిచ్చేవు కానీలేరా
(॥కంటిఁ॥)
చోప్పులెత్తి నీవంక చూడఁగానే నామీఁద
కప్పురము చల్లేవు కానీలేరా
చెప్పరానినీమేనిచెనకులు వెదకితే
కప్పేవు నీపచ్చడము కానీలేరా
(॥కంటిఁ॥)
రతిరాజతంత్రాలరహాస్యా లడిగితే యే
కతములాడవచ్చేవు కానీలేరా
యితరపుసొమ్ము లివి యేడవని అడిగితే
కతలెల్లాఁజేప్పేవు కానీలేరా
(॥కంటిఁ॥)
యిక్కువ నీమతకము లెరిఁగి నే నవ్వితేను
గక్కనఁ గాఁగిలించేవు కానీలేరా
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
కక్కసించితే మెచ్చేవు కానీలేరా
(||pallavi||)
kaṁṭim̐ gaṁṭi nīvidyalu kānīlerā
kaṁṭamāla yichchevu kānīlerā
(||kaṁṭim̐||)
soppulĕtti nīvaṁka sūḍam̐gāne nāmīm̐da
kappuramu sallevu kānīlerā
sĕpparāninīmenisĕnagulu vĕdagide
kappevu nībachchaḍamu kānīlerā
(||kaṁṭim̐||)
radirājadaṁtrālarahāsyā laḍigide ye
kadamulāḍavachchevu kānīlerā
yidarabusŏmmu livi yeḍavani aḍigide
kadalĕllām̐jeppevu kānīlerā
(||kaṁṭim̐||)
yikkuva nīmadagamu lĕrim̐gi ne navvidenu
gakkanam̐ gām̐giliṁchevu kānīlerā
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
kakkasiṁchide mĕchchevu kānīlerā