Kamtim gamti nee guttu kaaneeleraa

కంటిఁ గంటి నీ గుట్టు కానీలేరా
Language

(॥పల్లవి॥)
కంటిఁ గంటి నీ గుట్టు కానీలేరా
కంటగించీ నీ గుణాలు కానీలేరా

(॥॥)
అడరి నావద్ద నుండి యట్టె వుస్సురనేవు
కడ నేమిదలఁచితో కానీలేరా
అడియాలపుమచ్చము లంగమునఁ జూచితేను
కడుఁదేలించి చూచేవు కానీలేరా

(॥॥)
నెమ్మి నిన్ను వలపించేనెలఁతపే రడిగితే
కమ్మర నాతో నవ్వేవు కానీలేరా
రమ్మని యాకెయింటికి రతి నానవెట్టితేను
కమ్మి నానోరు మూసేవు కానీలేరా

(॥॥)
వక్కణించి నీమోవి వాడుదేరీ నేలంటే
గక్కనఁగాఁగిలించేవు కానీలేరా
యెక్కువ శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కక్కసించనోప నిఁక గానీలేరా

(||pallavi||)
kaṁṭim̐ gaṁṭi nī guṭṭu kānīlerā
kaṁṭagiṁchī nī guṇālu kānīlerā

(||||)
aḍari nāvadda nuṁḍi yaṭṭĕ vussuranevu
kaḍa nemidalam̐sido kānīlerā
aḍiyālabumachchamu laṁgamunam̐ jūsidenu
kaḍum̐deliṁchi sūsevu kānīlerā

(||||)
nĕmmi ninnu valabiṁchenĕlam̐tabe raḍigide
kammara nādo navvevu kānīlerā
rammani yāgĕyiṁṭigi radi nānavĕṭṭidenu
kammi nānoru mūsevu kānīlerā

(||||)
vakkaṇiṁchi nīmovi vāḍuderī nelaṁṭe
gakkanam̐gām̐giliṁchevu kānīlerā
yĕkkuva śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
kakkasiṁchanoba nim̐ka gānīlerā