కంటిఁ బో విూచేఁత లెల్లాఁ గన్నులారను
(॥పల్లవి॥)
కంటిఁ బో విూచేఁత లెల్లాఁ గన్నులారను
అంటకు నీ విఁక మమ్ము నది వింత గాదా
(॥కంటి॥)
వుంగరాలవేళ్లఁ దలు పూఁది యొక్కచెలి నీతో
తొంగి చూచి మాటలాడె తొలుతే కాదా
ముంగిట నిన్ను నలమి మూఁపుపై గడ్డము మోపి
అంగవించి కనుచొక్కె నప్పుడే కాదా
(॥కంటి॥)
ముంచిన నీ కొనగొంగు ముంజేతఁ జుట్టి పట్టి
అంచెల ని న్నానవెట్టె నాకె కాదా
కంచపు మోవి వీ కిచ్చి గంటి సేసే నీ మోవి
యించుక నవ్వించె నిన్ను నిది వింతగాదా
(॥కంటి॥)
కొప్పు వీడఁ బెనఁగుచు కొమ్మ నిన్నుఁ బిలువఁగ
అప్పుడే లోనికిఁ బోతి వందుకే కాదా
యిప్పుడు శ్రీవేంకటేశ యిదే నన్నుఁ గూడితివి
చెప్పఁ బోతే నీకు నవి సిగ్గువాటు గాదా
(||pallavi||)
kaṁṭim̐ bo viూsem̐ta lĕllām̐ gannulāranu
aṁṭagu nī vim̐ka mammu nadi viṁta gādā
(||kaṁṭi||)
vuṁgarālaveḽlam̐ dalu pūm̐di yŏkkasĕli nīdo
tŏṁgi sūsi māḍalāḍĕ tŏlude kādā
muṁgiḍa ninnu nalami mūm̐pubai gaḍḍamu mobi
aṁgaviṁchi kanusŏkkĕ nappuḍe kādā
(||kaṁṭi||)
muṁchina nī kŏnagŏṁgu muṁjedam̐ juṭṭi paṭṭi
aṁchĕla ni nnānavĕṭṭĕ nāgĕ kādā
kaṁchabu movi vī kichchi gaṁṭi sese nī movi
yiṁchuga navviṁchĕ ninnu nidi viṁtagādā
(||kaṁṭi||)
kŏppu vīḍam̐ bĕnam̐gusu kŏmma ninnum̐ biluvam̐ga
appuḍe lonigim̐ bodi vaṁduge kādā
yippuḍu śhrīveṁkaḍeśha yide nannum̐ gūḍidivi
sĕppam̐ bode nīgu navi sigguvāḍu gādā