Kamtigamti nee gunaalu kadalugaanu

కంటికంటి నీ గుణాలు కతలుగాను
Language

(॥పల్లవి॥)
కంటికంటి నీ గుణాలు కతలుగాను
వొంటి నొడ్డించుకొంటేను వొరయక మానేవా

(॥కంటి॥)
సిగ్గు వడఁగానే మరిఁ జెనకేవు సారెసారె
యెగ్గు పట్టితేఁ గనక యేమి సేతువో
దగ్గరనుండఁగానే తమకించేవప్పటిని
కగ్గి తెరవేసితేను కాతరించకుండేవా

(॥కంటి॥)
వొదిగి వూరకుండఁగా నొడి వట్టి తీసేవు
యెదురుమాటాడితేను యేమి సేతువో
పొదుగుక వుండఁగానే పొంచేవు చన్నుల
వుదుటున జంకించితే నొలిసి పైకొనేవా

(॥కంటి॥)
గక్కనఁ గాఁగిలించఁగాఁ గలసితి వింతలోనే
ఇక్కవ లంటితేనిఁక నేమి సేతువో
అక్కరై శ్రీ వేంకటేశ అలమేల్మంగనే నేను
చిక్కితివి నే మొక్కితేఁ జెలరేఁగదా

(||pallavi||)
kaṁṭigaṁṭi nī guṇālu kadalugānu
vŏṁṭi nŏḍḍiṁchugŏṁṭenu vŏrayaga mānevā

(||kaṁṭi||)
siggu vaḍam̐gāne marim̐ jĕnagevu sārĕsārĕ
yĕggu paṭṭidem̐ ganaga yemi seduvo
daggaranuṁḍam̐gāne tamagiṁchevappaḍini
kaggi tĕravesidenu kādariṁchaguṁḍevā

(||kaṁṭi||)
vŏdigi vūraguṁḍam̐gā nŏḍi vaṭṭi tīsevu
yĕdurumāḍāḍidenu yemi seduvo
pŏduguga vuṁḍam̐gāne pŏṁchevu sannula
vuduḍuna jaṁkiṁchide nŏlisi paigŏnevā

(||kaṁṭi||)
gakkanam̐ gām̐giliṁcham̐gām̐ galasidi viṁtalone
ikkava laṁṭidenim̐ka nemi seduvo
akkarai śhrī veṁkaḍeśha alamelmaṁgane nenu
sikkidivi ne mŏkkidem̐ jĕlarem̐gadā