Kamti neemanasu nenu kadamalenivaamdavu

కంటి నీమనసు నేను కడమలేనివాఁడవు
Language

(॥పల్లవి॥)
కంటి నీమనసు నేను కడమలేనివాఁడవు
అంటి ముట్టి పెనఁగేవు అలపు లేదెపుడు

(॥॥)
యెంతయినా మన్నింతువు ఇటు నీకు వలచిన-
కాంతలను మొగమోటఁ గాదనఁబోవు
పంతములైనా నిత్తువు బత్తిసేసినవారికి
చెంతఁ బెండ్లికొడుకవై సిగ్గువడ వెపుడు

(॥॥)
చెప్పినట్టు సేతువు చెలిమికతైలకును
వుప్పతిల్లు నేస్తమున నోపననవు
కుప్పళింతువు ప్రియము కూటమిగలవారికి
చిప్పిలు మేలువాడవై సిగ్గువడ విపుడు

(॥॥)
కందువల గూడుదువు కామించినమావంటి
ఇందుముఖుల మేలాన నీడేర్తువు
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
చెందినతమకముల సిగ్గువడ వెపుడు

(||pallavi||)
kaṁṭi nīmanasu nenu kaḍamalenivām̐ḍavu
aṁṭi muṭṭi pĕnam̐gevu alabu ledĕbuḍu

(||||)
yĕṁtayinā manniṁtuvu iḍu nīgu valasina-
kāṁtalanu mŏgamoḍam̐ gādanam̐bovu
paṁtamulainā nittuvu battisesinavārigi
sĕṁtam̐ bĕṁḍligŏḍugavai sigguvaḍa vĕbuḍu

(||||)
sĕppinaṭṭu seduvu sĕlimigadailagunu
vuppadillu nestamuna nobananavu
kuppaḽiṁtuvu priyamu kūḍamigalavārigi
sippilu meluvāḍavai sigguvaḍa vibuḍu

(||||)
kaṁduvala gūḍuduvu kāmiṁchinamāvaṁṭi
iṁdumukhula melāna nīḍerduvu
iṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
sĕṁdinadamagamula sigguvaḍa vĕbuḍu