Kamti nee vubaaya mimka kaamtaalimchi ninnu doora

కంటి నీ వుపాయ మింక కాంతాళించి నిన్ను దూర
Language

(॥పల్లవి॥)
కంటి నీ వుపాయ మింక కాంతాళించి నిన్ను దూర
జంటల నీ వల్ల నింత సతమాయ వేడుక

(॥॥)
యెచ్చి నీపై తలపోఁత లెన్నైనా వేడుకే
రచ్చ నీకుఁ గొన్నవిరాలి వేడుకే
అచ్చముగా నీ మీఁది ఆసలన్నీ వేడుకే
వచ్చినప్పుడు రమ్ము నీ వల్ల నింతా వేడుకే

(॥॥)
చెంది నీకుఁగాఁ బొడమే చెమటలు వేడుకే
కందువ నీ పై తమకము వేడుకే
పొందుల నీ కెదురు చూపులు నివీ వేడుకే
యెందు నున్నా నీవల్ల నింతా నాకు వేడుకే

(॥॥)
దవ్వులమాటలు వినే తరితీపు వేడుకే
యివ్వల నన్నుఁ గూడితి విడీ వేడుకే
రవ్వగా శ్రీ వేంకటరమణ మన రతుల
జవ్వన మదములలో సాదింపుల వేడుకే

(||pallavi||)
kaṁṭi nī vubāya miṁka kāṁtāḽiṁchi ninnu dūra
jaṁṭala nī valla niṁta sadamāya veḍuga

(||||)
yĕchchi nībai talabom̐ta lĕnnainā veḍuge
rachcha nīgum̐ gŏnnavirāli veḍuge
achchamugā nī mīm̐di āsalannī veḍuge
vachchinappuḍu rammu nī valla niṁtā veḍuge

(||||)
sĕṁdi nīgum̐gām̐ bŏḍame sĕmaḍalu veḍuge
kaṁduva nī pai tamagamu veḍuge
pŏṁdula nī kĕduru sūbulu nivī veḍuge
yĕṁdu nunnā nīvalla niṁtā nāgu veḍuge

(||||)
davvulamāḍalu vine taridību veḍuge
yivvala nannum̐ gūḍidi viḍī veḍuge
ravvagā śhrī veṁkaḍaramaṇa mana radula
javvana madamulalo sādiṁpula veḍuge