Kamti nee gunamu litte kannula tuda nenu

కంటి నీ గుణము లిట్టే కన్నుల తుద నేను
Language

(॥పల్లవి॥)
కంటి నీ గుణము లిట్టే కన్నుల తుద నేను
జంటయై కొలిచితేను సంతోసమౌ నీకూ

(॥॥)
హత్తి నీకు సేవ సేసే యంగనలఁ గంటేను
చిత్తమునఁ బెట్టి రక్షింతువు నీవూ
బత్తి నీపైఁ గలిగితే భావ మెల్లాఁ జిగిరించు
గుత్తపు నీ నెలవుల గొబ్బున నవ్వు నిండు

(॥॥)
యెనసి నీ పట్టుకు నిచ్చకము నెరపితే
ఘనమైన నీమనసు కడుఁ గరఁగు
ననుపుతో నీ మొగము నాటుకొనఁ జూచితేను
గనులై మించి మదనకళ లెల్లా రేఁగునూ

(॥॥)
ఆయము లెఱిగి నీ యంగములు ముట్టి తేను
పాయపు మదము నిదె పయిపై మించు
యీయెడ శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
పాయక నన్నేలితివి పచ్చిదేరు సిగ్గులూ.

(||pallavi||)
kaṁṭi nī guṇamu liṭṭe kannula tuda nenu
jaṁṭayai kŏlisidenu saṁtosamau nīgū

(||||)
hatti nīgu seva sese yaṁganalam̐ gaṁṭenu
sittamunam̐ bĕṭṭi rakṣhiṁtuvu nīvū
batti nībaim̐ galigide bhāva mĕllām̐ jigiriṁchu
guttabu nī nĕlavula gŏbbuna navvu niṁḍu

(||||)
yĕnasi nī paṭṭugu nichchagamu nĕrabide
ghanamaina nīmanasu kaḍum̐ garam̐gu
nanubudo nī mŏgamu nāḍugŏnam̐ jūsidenu
ganulai miṁchi madanagaḽa lĕllā rem̐gunū

(||||)
āyamu lĕṟigi nī yaṁgamulu muṭṭi tenu
pāyabu madamu nidĕ payibai miṁchu
yīyĕḍa śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
pāyaga nannelidivi pachchideru siggulū.