Kamti mitte mee pomdulu kannulabamduga gaanu

కంటి మిట్టే మీ పొందులు కన్నులపండుగ గాను
Language

(॥పల్లవి॥)
కంటి మిట్టే మీ పొందులు కన్నులపండుగ గాను
జంటఁ గొసరుదుము మీ సరిత లెఱఁగకా

(॥॥)
యిద్దరును నొక్కటే యింతులెల్లా విన్నవించే
సుద్దులే వేరుగాని చూడఁ జూడను
వొద్దికతో మారుకు మారొక రొక రుంగరాలు
కొద్దులై వున్నవి మీఁద కొనవేళ్ళ నివివో

(॥॥)
తలఁపు లెప్ప టివే తరితీపుల మీకు
చెలి పెనఁగు లాటలే చెప్పఁ గొత్తలు
పులకల నొక్కమాటే పొదలి మీ మేనులను
వెలసెఁ దారుకాణలై వేడుకతో నివివో

(॥॥)
అతఁడు శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
రతులే యెంచరానివి రచ్చలోనను
తతితోడఁ గూడితిరి తనువునఁ గళ లంటె
మితి మీఱి మాకుఁ జూడ మెచ్చులాయ నివివో

(||pallavi||)
kaṁṭi miṭṭe mī pŏṁdulu kannulabaṁḍuga gānu
jaṁṭam̐ gŏsarudumu mī sarida lĕṟam̐gagā

(||||)
yiddarunu nŏkkaḍe yiṁtulĕllā vinnaviṁche
suddule verugāni sūḍam̐ jūḍanu
vŏddigado mārugu mārŏga rŏga ruṁgarālu
kŏddulai vunnavi mīm̐da kŏnaveḽḽa nivivo

(||||)
talam̐pu lĕppa ṭive taridībula mīgu
sĕli pĕnam̐gu lāḍale sĕppam̐ gŏttalu
pulagala nŏkkamāḍe pŏdali mī menulanu
vĕlasĕm̐ dārugāṇalai veḍugado nivivo

(||||)
adam̐ḍu śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
radule yĕṁcharānivi rachchalonanu
tadidoḍam̐ gūḍidiri tanuvunam̐ gaḽa laṁṭĕ
midi mīṟi māgum̐ jūḍa mĕchchulāya nivivo