కంటి మిన్నాళ్లకు గక్కన దొంగను
(॥పల్లవి॥)
కంటి మిన్నాళ్లకు గక్కన దొంగను
అంటె నోర నదే అంగమచ్చము
(॥కంటి॥)
వుట్టు లెక్కినాఁ డొక్క తొక్కతె
తిట్టఁ దిట్ట వాని దిగఁ బిలవరే
గుట్టుఁ గృష్ణునికి గొల్లెతలకును
యెట్టు గావలసి నట్టయ్యీఁ గాని
(॥కంటి॥)
మూల నున్నాఁ డదె ముంగిటికిఁ దీసి
రోలఁ గట్టరే రోస మెల్లఁ దీర
నీలవర్ణునితో నేఁడు మనబలి
మేలాగున నైన నెక్కీఁ గాని
(॥కంటి॥)
మంచముపై వాఁడె మన మిందరము
కొంచక వొక్కొక్కగురుతు నేయరే
యెంచఁగ శ్రీవెంకటేశునకు మనకు
నంచెఁ బొందు లాయ నట్టే కాని
(||pallavi||)
kaṁṭi minnāḽlagu gakkana dŏṁganu
aṁṭĕ nora nade aṁgamachchamu
(||kaṁṭi||)
vuṭṭu lĕkkinām̐ ḍŏkka tŏkkadĕ
tiṭṭam̐ diṭṭa vāni digam̐ bilavare
guṭṭum̐ gṛṣhṇunigi gŏllĕdalagunu
yĕṭṭu gāvalasi naṭṭayyīm̐ gāni
(||kaṁṭi||)
mūla nunnām̐ ḍadĕ muṁgiḍigim̐ dīsi
rolam̐ gaṭṭare rosa mĕllam̐ dīra
nīlavarṇunido nem̐ḍu manabali
melāguna naina nĕkkīm̐ gāni
(||kaṁṭi||)
maṁchamubai vām̐ḍĕ mana miṁdaramu
kŏṁchaga vŏkkŏkkagurudu neyare
yĕṁcham̐ga śhrīvĕṁkaḍeśhunagu managu
naṁchĕm̐ bŏṁdu lāya naṭṭe kāni