కంటి మిదివో నేము కన్నులపండుగగాను
(॥పల్లవి॥)
కంటి మిదివో నేము కన్నులపండుగగాను
జంటలఁ గొలువై నీవు చనవియ్యఁగాను
(॥కంటి॥)
హేమంతకాలము నేఁడు యిటు నీతిరుమేన
ఆముకొని జనియించినట్లుండెను
భూమిఁగలకప్పురము పొడిసేసి నిలువెల్లా
నేమముతో నిందరును నీకుఁ జాతఁగాను
(॥కంటి॥)
వానకాలము నీలవర్ణముతోఁ దిరుమేన
సోనయై కురిసినట్టు చూపట్టెను
సేనగాదట్టుపుణుఁగు చిత్తడిగా సర్వాంగాల
పూని యిందరును నీకుఁ బూయఁగాను
(॥కంటి॥)
వసతకాలంము తానె వచ్చి నీ తిరుమేన
యెసగినట్టు శ్రీవేంకటేశ తోఁచెను
వెస నలమేల్మంగతో వింతసొమ్ము నీవురాన
పొసగి: చందరు విన్నందరు బొగడఁగాను
(||pallavi||)
kaṁṭi midivo nemu kannulabaṁḍugagānu
jaṁṭalam̐ gŏluvai nīvu sanaviyyam̐gānu
(||kaṁṭi||)
hemaṁtagālamu nem̐ḍu yiḍu nīdirumena
āmugŏni janiyiṁchinaṭluṁḍĕnu
bhūmim̐galagappuramu pŏḍisesi niluvĕllā
nemamudo niṁdarunu nīgum̐ jādam̐gānu
(||kaṁṭi||)
vānagālamu nīlavarṇamudom̐ dirumena
sonayai kurisinaṭṭu sūbaṭṭĕnu
senagādaṭṭubuṇum̐gu sittaḍigā sarvāṁgāla
pūni yiṁdarunu nīgum̐ būyam̐gānu
(||kaṁṭi||)
vasadagālaṁmu tānĕ vachchi nī tirumena
yĕsaginaṭṭu śhrīveṁkaḍeśha tom̐sĕnu
vĕsa nalamelmaṁgado viṁtasŏmmu nīvurāna
pŏsagi: saṁdaru vinnaṁdaru bŏgaḍam̐gānu