కంటి మిదె యీ యర్థము ఘననిధానమువలె
(॥పల్లవి॥)
కంటి మిదె యీ యర్థము ఘననిధానమువలె
నంటెను నీ కృపవల్ల నాతుమలో నాకును
(॥కంటి॥)
కన్నులెదిటే జగము కాణాచి గడించేమంటే
నెన్ని బ్రహ్మాండము లేగె నింతక తొల్లి
పన్నిన కాణాచి నీ పాదములందు గడించి
యున్నవారు సనకాదియోగీంద్రవర్యులు
(॥కంటి॥)
గొందినే బ్రహ్మపట్టము గోరి జపియించు మంటే
నెందరు బ్రహ్మలు చని రింతక తొల్లి
యిందు నందు నీ లోకమే యిరవుగా జపియించి
అందిరి నీపదము ప్రహ్లదనారదాదులు
(॥కంటి॥)
కాంతులు మించినయట్టి కాయసిద్ధి గోరే మంటే
నెంత సృష్టి చనెనో యింతక తొల్లి
చెంత శ్రీవేంకటేశ్వరు సేవాసిద్ధి యడిగి
సంతోషమునఁ బొందిరి సర్వనిత్యముక్తులు
(||pallavi||)
kaṁṭi midĕ yī yardhamu ghananidhānamuvalĕ
naṁṭĕnu nī kṛpavalla nādumalo nāgunu
(||kaṁṭi||)
kannulĕdiḍe jagamu kāṇāsi gaḍiṁchemaṁṭe
nĕnni brahmāṁḍamu legĕ niṁtaga tŏlli
pannina kāṇāsi nī pādamulaṁdu gaḍiṁchi
yunnavāru sanagādiyogīṁdravaryulu
(||kaṁṭi||)
gŏṁdine brahmabaṭṭamu gori jabiyiṁchu maṁṭe
nĕṁdaru brahmalu sani riṁtaga tŏlli
yiṁdu naṁdu nī logame yiravugā jabiyiṁchi
aṁdiri nībadamu prahladanāradādulu
(||kaṁṭi||)
kāṁtulu miṁchinayaṭṭi kāyasiddhi gore maṁṭe
nĕṁta sṛṣhṭi sanĕno yiṁtaga tŏlli
sĕṁta śhrīveṁkaḍeśhvaru sevāsiddhi yaḍigi
saṁtoṣhamunam̐ bŏṁdiri sarvanityamuktulu