కంటి మిదె మిమ్మిద్దరిఁ గన్నులపండుగలాయ
(॥పల్లవి॥)
కంటి మిదె మిమ్మిద్దరిఁ గన్నులపండుగలాయ
జంటనున్న చెలులము సారెఁ బొగడేమే
(॥కంటి॥)
చెంతనుండి నాయకుఁడు చెప్పినట్టు సేసితేను
ఇంతులు సేసినభాగ్య మేమిచెప్పేదే
వింతలేక యేపొద్దు వెస మాటలాడితేను
సంతోసాలకు మరి సరిగలదటవే
(॥కంటి॥)
మమకరించి మగనిమన్నన గలిగితేను
రమణులు సేసినదే రాజ్యమాయనే
సమరతి మనసుసు సరిఁ దులఁదూఁగితేను
కొమరెపాయములకు గురుతెట్టు వెట్టేమే
(॥కంటి॥)
పతియైనతఁడు తమపక్క వాయకుండితేను
సతులు సేసిననోము సమకూడెనే
అతఁడు శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
తతిఁ గూడితిరి మీతలఁపు లీడేరెనే
(||pallavi||)
kaṁṭi midĕ mimmiddarim̐ gannulabaṁḍugalāya
jaṁṭanunna sĕlulamu sārĕm̐ bŏgaḍeme
(||kaṁṭi||)
sĕṁtanuṁḍi nāyagum̐ḍu sĕppinaṭṭu sesidenu
iṁtulu sesinabhāgya memisĕppede
viṁtalega yebŏddu vĕsa māḍalāḍidenu
saṁtosālagu mari sarigaladaḍave
(||kaṁṭi||)
mamagariṁchi maganimannana galigidenu
ramaṇulu sesinade rājyamāyane
samaradi manasusu sarim̐ dulam̐dūm̐gidenu
kŏmarĕbāyamulagu gurudĕṭṭu vĕṭṭeme
(||kaṁṭi||)
padiyainadam̐ḍu tamabakka vāyaguṁḍidenu
sadulu sesinanomu samagūḍĕne
adam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
tadim̐ gūḍidiri mīdalam̐pu līḍerĕne