కంటే సుంకము నీకు కానకుంటే బింకము
(॥పల్లవి॥)
కంటే సుంకము నీకు కానకుంటే బింకము
వొంటదు నాతోడి పొందు వొలసీ నొల్లములు
(॥కంటే॥)
కదిసి నే నెదురైతే గక్కన వచ్చితి గాక
యిదే నీ వూరకవుంటే యెందువోదు
పదరి నేఁ బలుకఁగ పతిమాటాడితిఁ గాక
మదిలో గుట్టుననుండేవట నీకు లాభము
(॥కంటే॥)
యిటు నే నెచ్చరించఁగా యిక్కడఁ జూచితిఁగాక
కటకటా లేకున్న యెక్కడ చూతువో
నటనకు నేఁ గాఁగా నవ్వితి వింతే కాక
యిటు గాకుండితే నవ్వు లివే నీకు లాభము
(॥కంటే॥)
ముంచి నేఁ గౌఁగిలించఁగ మోవి యిచ్చితివి గాక
వంచన నే రాకున్న నెవ్వతే కిత్తువో
చంచుల శ్రీవేంకటేశ సమరతి మన కందె
యెంచరాని పరవశాలివే నీకు లాభము
(||pallavi||)
kaṁṭe suṁkamu nīgu kānaguṁṭe biṁkamu
vŏṁṭadu nādoḍi pŏṁdu vŏlasī nŏllamulu
(||kaṁṭe||)
kadisi ne nĕduraide gakkana vachchidi gāga
yide nī vūragavuṁṭe yĕṁduvodu
padari nem̐ balugam̐ga padimāḍāḍidim̐ gāga
madilo guṭṭunanuṁḍevaḍa nīgu lābhamu
(||kaṁṭe||)
yiḍu ne nĕchchariṁcham̐gā yikkaḍam̐ jūsidim̐gāga
kaḍagaḍā legunna yĕkkaḍa sūduvo
naḍanagu nem̐ gām̐gā navvidi viṁte kāga
yiḍu gāguṁḍide navvu live nīgu lābhamu
(||kaṁṭe||)
muṁchi nem̐ gaum̐giliṁcham̐ga movi yichchidivi gāga
vaṁchana ne rāgunna nĕvvade kittuvo
saṁchula śhrīveṁkaḍeśha samaradi mana kaṁdĕ
yĕṁcharāni paravaśhālive nīgu lābhamu