కంటే సుంకము మరి కానకుంటే బింకము
(॥పల్లవి॥)
కంటే సుంకము మరి కానకుంటే బింకము
యింటికాఁడ మాతో మాయ లేల సేసే విఁకను
(॥కంటే॥)
కప్పి యాపె తనచేతికానుక నీ కియ్యఁగాను
ముప్పిరి నీ వప్పటి నా మోము చూచేవు
అప్పణ గొంటివా గోపాంగనల కెల్లఁ దొల్లి
యిప్పుడు నాతో మాయ లేల సేసే విఁకను
(॥కంటే॥)
పరగి యాపె నీకుఁ బనులు సేయ రాఁగాను
సరి నాకుఁ జేయు మంటా సన్న సేసేవు
పొరుగు పొరచిగా నీ పొలఁతులకుఁ జేయించు
యిరవు నాతో మాయ లేల సేసే విఁకను
(॥కంటే॥)
కందువ నాపె నిన్నుఁ గాఁగిలించుకోఁగాను
అంది నన్నుఁ గాఁగిలించి తందులోననె
పొందుమా శ్రీవెంకటేశ భూసతి శ్రీసతి నిట్టె
యిందులోనె నాతో మాయ లేల సేసే విఁకయ
(||pallavi||)
kaṁṭe suṁkamu mari kānaguṁṭe biṁkamu
yiṁṭigām̐ḍa mādo māya lela sese vim̐kanu
(||kaṁṭe||)
kappi yābĕ tanasedigānuga nī kiyyam̐gānu
muppiri nī vappaḍi nā momu sūsevu
appaṇa gŏṁṭivā gobāṁganala kĕllam̐ dŏlli
yippuḍu nādo māya lela sese vim̐kanu
(||kaṁṭe||)
paragi yābĕ nīgum̐ banulu seya rām̐gānu
sari nāgum̐ jeyu maṁṭā sanna sesevu
pŏrugu pŏrasigā nī pŏlam̐tulagum̐ jeyiṁchu
yiravu nādo māya lela sese vim̐kanu
(||kaṁṭe||)
kaṁduva nābĕ ninnum̐ gām̐giliṁchugom̐gānu
aṁdi nannum̐ gām̐giliṁchi taṁdulonanĕ
pŏṁdumā śhrīvĕṁkaḍeśha bhūsadi śhrīsadi niṭṭĕ
yiṁdulonĕ nādo māya lela sese vim̐kaya