కమ్మి నీవొకటొకటె గడించుకొనేవు గాక
(॥పల్లవి॥)
కమ్మి నీవొకటొకటె గడించుకొనేవు గాక
నమ్మితిఁ దొల్లె నిన్ను నవ్వు లేఁటికయ్యా
(॥॥)
తీరనియాసలతోడ దిష్టించి చూచితిఁ గాక
నేరమెంచి కోపగించ నీ వేమి సేసితివయ్య
నేరుపుతోఁ గస్తూరి నీమేనఁ బూసితిఁగాక
కారుకొని సోదించఁ గారణమేమయ్య
(॥॥)
మన్నించఁగాఁ గతలు వేమారు నేఁ జెప్పితిఁగాక
నిన్ను వెంగెములాడఁగ నీవల్లఁ గల్ల యేడయ్య
యెన్న నామగఁడవని యెరక సేసితిఁగాక
పన్ని మోవి గంటిసేయఁ బనియేమయ్య
(॥॥)
గుట్టునఁ గాఁగిటఁగూడి గుబ్బల నొత్తితిఁగాక
నెట్టుకొని సాదించ నీయందు వెలితేదయ్య
ఇట్టె శ్రీవేంకటేశ యే నలమేల్‌మంగను
చుట్టరిక మిఁకఁ జెప్పిచూప నేఁటికయ్య
(||pallavi||)
kammi nīvŏgaḍŏgaḍĕ gaḍiṁchugŏnevu gāga
nammidim̐ dŏllĕ ninnu navvu lem̐ṭigayyā
(||||)
tīraniyāsaladoḍa diṣhṭiṁchi sūsidim̐ gāga
neramĕṁchi kobagiṁcha nī vemi sesidivayya
nerubudom̐ gastūri nīmenam̐ būsidim̐gāga
kārugŏni sodiṁcham̐ gāraṇamemayya
(||||)
manniṁcham̐gām̐ gadalu vemāru nem̐ jĕppidim̐gāga
ninnu vĕṁgĕmulāḍam̐ga nīvallam̐ galla yeḍayya
yĕnna nāmagam̐ḍavani yĕraga sesidim̐gāga
panni movi gaṁṭiseyam̐ baniyemayya
(||||)
guṭṭunam̐ gām̐giḍam̐gūḍi gubbala nŏttidim̐gāga
nĕṭṭugŏni sādiṁcha nīyaṁdu vĕlidedayya
iṭṭĕ śhrīveṁkaḍeśha ye nalamelmaṁganu
suṭṭariga mim̐kam̐ jĕppisūba nem̐ṭigayya