Kammaram gammaram jeppa kada laayane

కమ్మరఁ గమ్మరఁ జెప్ప కత లాయనే
Language

(॥పల్లవి॥)
కమ్మరఁ గమ్మరఁ జెప్ప కత లాయనే
చిమ్ముల నీ పతి వాఁడె చిత్తగించవే

(॥కమ్మర॥)
చెక్కునఁ బెట్టినచేయి చెలువుఁ డింతలో రాఁగా
అక్కజపు నీ సిగ్గు కడ్డ మాయనే
తక్కక పయ్యదలోన దాఁచిన నీ కుచములు
పుక్క టైన జక్కవల పోరు గాయనే

(॥కమ్మర॥)
సెలవి నవ్విననవ్వు చేరి నీ పలుకులకు
చలువ లై యడనెడ చవు లాయనే
మెలుపున ముడిచిన మీ టైన నీతురుము
పొలయు తుమ్మిదలకు పూఁ టాయనే

(॥కమ్మర॥)
సేసెటి నీ విడెము శ్రీవెంకటేశు కూటమి
వీసరపోక మంచివిందు లాయనే
సేసపాల రతులలో చిప్పిలు నీ కెమ్మోవి
రాసి కెక్కి చిగురులరచ్చ లాయనే

(||pallavi||)
kammaram̐ gammaram̐ jĕppa kada lāyane
simmula nī padi vām̐ḍĕ sittagiṁchave

(||kammara||)
sĕkkunam̐ bĕṭṭinaseyi sĕluvum̐ ḍiṁtalo rām̐gā
akkajabu nī siggu kaḍḍa māyane
takkaga payyadalona dām̐sina nī kusamulu
pukka ṭaina jakkavala poru gāyane

(||kammara||)
sĕlavi navvinanavvu seri nī palugulagu
saluva lai yaḍanĕḍa savu lāyane
mĕlubuna muḍisina mī ṭaina nīdurumu
pŏlayu tummidalagu pūm̐ ṭāyane

(||kammara||)
sesĕḍi nī viḍĕmu śhrīvĕṁkaḍeśhu kūḍami
vīsaraboga maṁchiviṁdu lāyane
sesabāla radulalo sippilu nī kĕmmovi
rāsi kĕkki sigurularachcha lāyane