కమ్మటి నెవ్వరినైనాఁ గాకు సేసీని
(॥పల్లవి॥)
కమ్మటి నెవ్వరినైనాఁ గాకు సేసీని
ఇమ్ముల నా సోదము యెంత గద్దో చూడరే
(॥॥)
కొలువై వున్నాఁడు వాఁడె గోవిందరాజు మించి
చెలు లిద్దరు పాదాలు చేరి యొత్తఁగా
చెలరేఁగి నవ్వుకొంటా శేషునిపైఁ బవళించి
పలుమారు వలపులు పచరించీఁ జూడరే
(॥॥)
తగవులు దిద్దీ వాఁడే తమితో గోవిందరాజు
మగువ లందెంది యాకుమడిచియ్యఁగా
జిగి మర్మాలంటుకొంటా చిత్తరువుమేడలోన
వెగటులేని మోహము వెదచల్లీఁ జూడరే
(॥॥)
కదిసీ నదివో శ్రీ వేంకటాద్రి గోవిందరాజు
సుదతులు కాఁగిట మెచ్చులు మెచ్చఁగా
గుదిగొన మోవియిచ్చుకొంటా నేకతమున
పొదిగొన్నమచ్చికలు పోదిసేసీఁ జూడరే
(||pallavi||)
kammaḍi nĕvvarinainām̐ gāgu sesīni
immula nā sodamu yĕṁta gaddo sūḍare
(||||)
kŏluvai vunnām̐ḍu vām̐ḍĕ goviṁdarāju miṁchi
sĕlu liddaru pādālu seri yŏttam̐gā
sĕlarem̐gi navvugŏṁṭā śheṣhunibaim̐ bavaḽiṁchi
palumāru valabulu pasariṁchīm̐ jūḍare
(||||)
tagavulu diddī vām̐ḍe tamido goviṁdarāju
maguva laṁdĕṁdi yāgumaḍisiyyam̐gā
jigi marmālaṁṭugŏṁṭā sittaruvumeḍalona
vĕgaḍuleni mohamu vĕdasallīm̐ jūḍare
(||||)
kadisī nadivo śhrī veṁkaḍādri goviṁdarāju
sudadulu kām̐giḍa mĕchchulu mĕchcham̐gā
gudigŏna moviyichchugŏṁṭā negadamuna
pŏdigŏnnamachchigalu podisesīm̐ jūḍare