కంకణము గట్టితివి కాంత నీకు దేవులాయ
(॥పల్లవి॥)
కంకణము గట్టితివి కాంత నీకు దేవులాయ
ఇంక నిట్టె వుండరయ్య ఇది మా విన్నపము
(॥కంక॥)
దయతో మన్నించవయ్యా తరుణి నీకెప్పుడును
ప్రియురాలు సేసపాల వెండ్లికూఁతురు
నియతాన నేలవయ్యా నేరాలు వేయకువయ్య
నయగారి పాయరాని ననుపైనచుట్టము
(॥కంక॥)
కులశీలము గలది గుణవంతురాలు యాకె
నలినాక్షి నీకు మేనమఱఁదలు
తలఁపునఁ బెట్టవయ్య తగులు వాయకువయ్య
ఇలువరుసగలది యాడుజోడైనది
(॥కంక॥)
గరిమ నెల్లకాలము కాఁపురము సేయవయ్య
ఇరవైన జవరాలు ఇల్లాలు యాకె
మరిగి శ్రీవేంకటేశ మంచివేళఁ గూడితిరి
తరుణి నీమీఁద సంతతభక్తి గలది
(||pallavi||)
kaṁkaṇamu gaṭṭidivi kāṁta nīgu devulāya
iṁka niṭṭĕ vuṁḍarayya idi mā vinnabamu
(||kaṁka||)
dayado manniṁchavayyā taruṇi nīgĕppuḍunu
priyurālu sesabāla vĕṁḍligūm̐turu
niyadāna nelavayyā nerālu veyaguvayya
nayagāri pāyarāni nanubainasuṭṭamu
(||kaṁka||)
kulaśhīlamu galadi guṇavaṁturālu yāgĕ
nalinākṣhi nīgu menamaṟam̐dalu
talam̐punam̐ bĕṭṭavayya tagulu vāyaguvayya
iluvarusagaladi yāḍujoḍainadi
(||kaṁka||)
garima nĕllagālamu kām̐puramu seyavayya
iravaina javarālu illālu yāgĕ
marigi śhrīveṁkaḍeśha maṁchiveḽam̐ gūḍidiri
taruṇi nīmīm̐da saṁtadabhakti galadi