Kamduvugaani yappude kaligina valabulu

కందువుగాని యప్పుడే కలిగిన వలపులు
Language

(॥పల్లవి॥)
కందువుగాని యప్పుడే కలిగిన వలపులు
సందడి జాగు లేఁటికి సంగడి నున్నారము

(॥॥)
పొంచి మా యిద్దరినేరుపులుఁ జూడవలసితే
మంచముపైకి రారాదా మందలించేము
యెంచనేల పెండ్లాడితి విద్దరిని నొకమాటె
పంచుక పైఁజాచరాదా పాదా లొత్తేము

(॥॥)
దండిమాచన్నులగొప్పతన మెరఁగవలస్తే
నిండఁగాఁ గాఁగిలించరాదా నీటుచూపేము
అండనే మాతో నవ్వేవు అట్టే మానడుమ నీవు
పండి చూడరాదా నిన్నుఁబచారించేము

(॥॥)
మించిన మా రతిబలిమి యెరఁగ వలసితే
కంచపు మో వియ్యరాదా కళరేఁచేము
అంచల శ్రీ వేంకటేశ అట్టె మమ్ము నేలితివి
నించరాదా పై రెంటెము నిన్ను మెప్పించేము

(||pallavi||)
kaṁduvugāni yappuḍe kaligina valabulu
saṁdaḍi jāgu lem̐ṭigi saṁgaḍi nunnāramu

(||||)
pŏṁchi mā yiddarinerubulum̐ jūḍavalaside
maṁchamubaigi rārādā maṁdaliṁchemu
yĕṁchanela pĕṁḍlāḍidi viddarini nŏgamāḍĕ
paṁchuga paim̐jāsarādā pādā lŏttemu

(||||)
daṁḍimāsannulagŏppadana mĕram̐gavalaste
niṁḍam̐gām̐ gām̐giliṁcharādā nīḍusūbemu
aṁḍane mādo navvevu aṭṭe mānaḍuma nīvu
paṁḍi sūḍarādā ninnum̐basāriṁchemu

(||||)
miṁchina mā radibalimi yĕram̐ga valaside
kaṁchabu mo viyyarādā kaḽarem̐semu
aṁchala śhrī veṁkaḍeśha aṭṭĕ mammu nelidivi
niṁcharādā pai rĕṁṭĕmu ninnu mĕppiṁchemu