కందువలన్నియు నందే కానవచ్చీని
(॥పల్లవి॥)
కందువలన్నియు నందే కానవచ్చీని
అందముగ నేఁడాకె యంకెకు రారాదా
(॥॥)
చిగురు నీపెదవాపెచే గంటి సేయించకున్న
నగరాదా నీవిప్పుడు నన్నుఁ జూచి
యెగసక్కెములు నీతోనేల యిప్పటనుంటిని
మగపాడి నాపెతోను మాటలాడరాదా
(॥॥)
కొనబు నీచెక్కులాకె గోర గీరించకున్న
అనరాదా నీవప్పుడు అందరితోను
పెనఁగనేటికి నీతో పెద్దరికములు చెప్పి
కనుఁగొనేవాకెతో నేక తమాడరాదా
(॥॥)
కోమలపు నీమేనాపెగుబ్బల నొత్తించకున్న
యేమన్నాఁ బంగించరాదా యింతలోనే
కామించి శ్రీవేంకటేశ కలసితివీకె నిట్టే
ప్రేమతో నురముమీఁదఁ బెట్టుకొనరాదా
(||pallavi||)
kaṁduvalanniyu naṁde kānavachchīni
aṁdamuga nem̐ḍāgĕ yaṁkĕgu rārādā
(||||)
siguru nībĕdavābĕse gaṁṭi seyiṁchagunna
nagarādā nīvippuḍu nannum̐ jūsi
yĕgasakkĕmulu nīdonela yippaḍanuṁṭini
magabāḍi nābĕdonu māḍalāḍarādā
(||||)
kŏnabu nīsĕkkulāgĕ gora gīriṁchagunna
anarādā nīvappuḍu aṁdaridonu
pĕnam̐ganeḍigi nīdo pĕddarigamulu sĕppi
kanum̐gŏnevāgĕdo nega tamāḍarādā
(||||)
komalabu nīmenābĕgubbala nŏttiṁchagunna
yemannām̐ baṁgiṁcharādā yiṁtalone
kāmiṁchi śhrīveṁkaḍeśha kalasidivīgĕ niṭṭe
premado nuramumīm̐dam̐ bĕṭṭugŏnarādā