Kamduvagu raavayya kalayavayyaa

కందువకు రావయ్య కలయవయ్యా
Language

(॥పల్లవి॥)
కందువకు రావయ్య కలయవయ్యా
సందడినే పొద్దులు జరపఁగఁ దగునా

(॥॥)
చాయలాను సన్నలాను సతి నిన్నుఁ గొసరఁగ
నీ యంత నీవే కరుణించ వలదా
నాయము లేలడిగేవు నాలి యేల సేసేవు
పాయపు వాలి నింత పరచఁ గందగునా

(॥॥)
ఆసలాను వాసులాను అతివ వేఁడుకోఁగాను
సేస వెట్టి చెప్పినట్టు సేయఁగ వద్దా
మూసి యేల నవ్వేవు మొఱఁగు లేల చూపేవు
వేసరని వారిని విసిగించఁ దగునా

(॥॥)
సిగ్గులాను చేఁతలాను చెలి నీకు మొక్కఁ గాను
నిగ్గులఁ గూడితివి మన్నించఁగ వద్దా
అగ్గమై శ్రీ వేంకటేశ అలయి కేల నించేవు
వొగ్గి పెండ్లాడిన వారి నొరయఁగఁ దగునా

(||pallavi||)
kaṁduvagu rāvayya kalayavayyā
saṁdaḍine pŏddulu jarabam̐gam̐ dagunā

(||||)
sāyalānu sannalānu sadi ninnum̐ gŏsaram̐ga
nī yaṁta nīve karuṇiṁcha valadā
nāyamu lelaḍigevu nāli yela sesevu
pāyabu vāli niṁta parasam̐ gaṁdagunā

(||||)
āsalānu vāsulānu adiva vem̐ḍugom̐gānu
sesa vĕṭṭi sĕppinaṭṭu seyam̐ga vaddā
mūsi yela navvevu mŏṟam̐gu lela sūbevu
vesarani vārini visigiṁcham̐ dagunā

(||||)
siggulānu sem̐talānu sĕli nīgu mŏkkam̐ gānu
niggulam̐ gūḍidivi manniṁcham̐ga vaddā
aggamai śhrī veṁkaḍeśha alayi kela niṁchevu
vŏggi pĕṁḍlāḍina vāri nŏrayam̐gam̐ dagunā