Kamduva reballelone kaanavachche nee suddulu

కందువ రేపల్లెలోనే కానవచ్చె నీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
కందువ రేపల్లెలోనే కానవచ్చె నీ సుద్దులు
అందుకొని పొగడ నిన్నలవి గాదు

(॥॥)
వారికి వారికి నీవు వలచినట్టున్నాఁడవు
యీ రీతి నీ జాణతన మెటువంటిదో
కోరి నీ వెందరినై నాఁ గొలువు సేయించు కొందు
చేరి నీ యోపిక యెంతో చెప్పరాదు

(॥॥)
భావింప నెవ్వరికైనా పక్కనున్నట్టు న్నాఁడవు
తావగు నీ విటరాయతన మెట్టిదో
వేవేలు సతులతోడ వేసారక మాటాడుదు
యేవల్లా నీ నేరుపు యెంచరాదు

(॥॥)
అందరికౌఁగిటఁ గూడి నట్లానే వున్నాఁడవు
అందిన నీ చుట్టరిక మది యెంతో
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
పొందితివి నీగుణాలు పొగడరాదూ

(||pallavi||)
kaṁduva reballĕlone kānavachchĕ nī suddulu
aṁdugŏni pŏgaḍa ninnalavi gādu

(||||)
vārigi vārigi nīvu valasinaṭṭunnām̐ḍavu
yī rīdi nī jāṇadana mĕḍuvaṁṭido
kori nī vĕṁdarinai nām̐ gŏluvu seyiṁchu kŏṁdu
seri nī yobiga yĕṁto sĕpparādu

(||||)
bhāviṁpa nĕvvarigainā pakkanunnaṭṭu nnām̐ḍavu
tāvagu nī viḍarāyadana mĕṭṭido
vevelu saduladoḍa vesāraga māḍāḍudu
yevallā nī nerubu yĕṁcharādu

(||||)
aṁdarigaum̐giḍam̐ gūḍi naṭlāne vunnām̐ḍavu
aṁdina nī suṭṭariga madi yĕṁto
aṁdabu śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
pŏṁdidivi nīguṇālu pŏgaḍarādū