కందువ నీప్రియములు కైకొనేఁ గాక
(॥పల్లవి॥)
కందువ నీప్రియములు కైకొనేఁ గాక
సందడి నిన్నెటువలె జరసేమయ్యా
(॥॥)
నంటున నాపె నీపై నవ్వులపువ్వులు వేసె
జంటచూపులఁ గస్తూరి సారెకుఁ జల్లె
పెంటసన్నల బువ్వానఁ బెదవి యెంగిలిసేసె
యింటివారము నేము నిన్నేమనేమయ్యా
(॥॥)
చెలరేఁ గె సరసపుసిగ్గుల గందము పూసె
వలపులచెమటల వంచెఁ బన్నీరు
నిలువుఁ జక్కఁదనాల నిన్ను బంటుగా నేలె
కులమువాండ్లము నిన్నుఁ గొసరనేలయ్యా
(॥॥)
వెంగెపుమాటలనే వీడెము లొసగె నేఁడు
అంగపుసోఁకులనే పెండ్లాడె నిన్నును
చెంగట నలమేల్మంగ శ్రీ వేంకటేశ నిన్నంటె
అంగపుఁ గాఁగిటివార మారడులేలయ్యా
(||pallavi||)
kaṁduva nīpriyamulu kaigŏnem̐ gāga
saṁdaḍi ninnĕḍuvalĕ jarasemayyā
(||||)
naṁṭuna nābĕ nībai navvulabuvvulu vesĕ
jaṁṭasūbulam̐ gastūri sārĕgum̐ jallĕ
pĕṁṭasannala buvvānam̐ bĕdavi yĕṁgilisesĕ
yiṁṭivāramu nemu ninnemanemayyā
(||||)
sĕlarem̐ gĕ sarasabusiggula gaṁdamu pūsĕ
valabulasĕmaḍala vaṁchĕm̐ bannīru
niluvum̐ jakkam̐danāla ninnu baṁṭugā nelĕ
kulamuvāṁḍlamu ninnum̐ gŏsaranelayyā
(||||)
vĕṁgĕbumāḍalane vīḍĕmu lŏsagĕ nem̐ḍu
aṁgabusom̐kulane pĕṁḍlāḍĕ ninnunu
sĕṁgaḍa nalamelmaṁga śhrī veṁkaḍeśha ninnaṁṭĕ
aṁgabum̐ gām̐giḍivāra māraḍulelayyā